క్రీడాభూమి

దక్షిణాఫ్రికాకు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 17: న్యూజిలాండ్‌తో జరుగు న్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 81 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 268 పరుగులకు సమాధానంగా, రెండు వికెట్ల నష్టానికి 24 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతోరెండో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లకు 349 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడినప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో టెంబా బవూమా, క్వింటన్ డికాక్ అర్ధ శతకాలతో ఆదుకోవడంతో ఊపిరిపీల్చుకుంది. బవూమా 160 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లతో 89 పరుగులు చేశాడు. డికాక్ 118 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు. వెర్నన్ ఫిలాండర్ (36 నాటౌట్), మోర్న్ మోర్కెల్ (31 నాటౌట్) తమ పోరాటాన్ని కొనసాగించడంతో దక్షిణాఫ్రికా కోలుకుంది. కివీస్ బౌలర్లలో కొలిన్ డి గ్రాండ్‌హోమ్, నీల్ వాగ్నర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 79.3 ఓవర్లలో 268 ఆలౌట్ (హెన్రీ నికోల్స్ 118, జీత్ రావెల్ 36, బ్రాడ్లే వాల్టింగ్ 34, జీన్ పాల్ డుమినీ 4/47, మోర్న్ మోర్కెల్ 2/82, కాగిసో రబదా 2/59, కేశవ్ మహారాజ్ 2/47).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 24): 95 ఓవర్లలో 9 వికెట్లకు 349 (టెంబా బవూమా 89, క్వింటన్ డి కాక్ 91, వెర్నర్ ఫిలాండర్ 36 నాటౌట్, మోర్న్ మోర్కెల్ 31 నాటౌట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 3/52, నీల్ వాగ్నర్ 3/96, టిమ్ సౌథీ 2/98).