క్రీడాభూమి

షకీబ్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 17: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ అద్భుతమైన సెంచరీతో కదంతొక్కగా, బంగ్లాదేశ్ 467 పరుగులు సాధించగలిగింది. అంతకు ముందు శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు కట్టడి చేసిన బంగ్లాదేశ్‌కు 129 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 214 పరుగులు చేసిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆటను కొనసాగించి, ముష్ఫికర్ రహీం (52) రూపంలో ఆరో వికెట్ చేజార్చుకుంది. 159 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్‌ను దినేష్ చండీమల్ క్యాచ్ అందుకోగా, లక్షన్ సెండకన్ అవుట్ చేశాడు. మొసాడెక్ హొస్సేన్ కూడా లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, 155 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ప్రత్యర్థికి గట్టిసవాలు విసిరే రీతిలో ఆడిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 467 పరుగుల వద్ద ముగియగా, అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 54 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 113.3 ఓవర్లలో 338 ఆలౌట్ (దినేష్ చండీమల్ 138, ధనంజయ డి సిల్వ 34, నిరోషన్ డిక్‌విల్లా 34, రంగన హెరాత్ 25, సురంగ లక్మల్ 35, మెహదీ హసన్ మీర్జా 3/90, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/50, సుభాసిస్ రాయ్ 2/53, షకీబ్ అల్ హసన్ 2/60).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 214: 134.1 ఓవర్లలో 467 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 49, సౌమ్య సర్కార్ 61, ఇమ్రుల్ కయాస్ 34, సబ్బీర్ రహ్మాన్ 42, షకీబ్ అల్ హసన్ 116, ముష్ఫికర్ రహీం 52, మొసాడెక్ హొస్సేన్ 75, రంగన హెరాత్ 4/82, లక్షణ్ సండాకన్ 3/140).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: వికెట్ నష్టం లేకుండా 54 (ఉపుల్ తరంగ 25 నాటౌట్, దిముత్ కరుణరత్నే 25 నాటౌట్).