క్రీడాభూమి

దటీజ్ ఇశాంత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 17: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వికెట్‌ను సాధించలేకపోయినా, అటు ప్రేక్షకులను, ఇటు కామెంటేటర్లను ఆకర్షించాడు. 20 ఓవర్లు బౌల్ చేసిన అతను 70 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే, తన చిత్రవిచిత్ర హావ భావాలతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆసీస్ ఓపెనర్ మాట్ రెన్‌షాతోపాటు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను అతను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. కోతిమాదిరి హావభావాలతో అతను వారిని వెక్కిరించే ప్రయత్నం చేశాడు. వికెట్ రాకపోతేనేం.. కోరుకున్నంత గుర్తింపు వచ్చిందంటూ ఇశాంత్ ఆనందించివుంటాడు.
* ఇంగ్లాండ్‌తో ముగిసిన, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న హోం సిరీస్‌లో భారత ఓపెనర్లు మొదటి వికెట్‌కు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం ఇది నాలుగోసారి. ఇదే సమయంలో ప్రత్యర్థి జట్ల ఓపెనర్లు తొమ్మిది పర్యాయాలు యాభై లేదా అంతకు మించిన భాగస్వామ్యాలను అందించారు. ఇలావుంటే, లోకేష్ రాహుల్, మురళీ విజయ్ 15 ఇన్నింగ్స్‌లో యాభైకిపైగా పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను అందించడం ఇది ఐదోసారి.
* భారత్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వందలకుపైగా పరుగులు సాధించిన సందర్భాలు ఇంతకు ముందు ఎనిమిది ఉన్నాయి. వాటిలో ఒకసారి మాత్రమే ఆసీస్ గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌లు డ్రాకాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది.