క్రీడాభూమి

ఫైనల్‌కు కుజ్నెత్సొవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 18: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాపై సంచలన విజయాన్ని సాధించిన ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఆమె 14వ ర్యాంకర్ ఎలెవెనా వెస్నినాను ఢీ కొంటుంది. మొదటి సెమీ ఫైనల్‌లో కుజ్నెత్సొవాకు ప్లిస్కోవా నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఇరువురు క్రీడాకారిణులు సర్వశక్తులు ఒడ్డడంతో పోరు నువ్వా, నేనా అన్న చందంగా సాగింది. అయితే, రెండు వరుస సెట్లను అతి కష్టం మీద గెల్చుకున్న కుజ్నెత్సొవా ఫైనల్‌కు దూసుకెళ్లగా, టైటిల్ రేసులో ఉందనుకున్న ప్లిస్కోవా ఎవరూ ఊహించని రీతిలో నిష్క్రమించింది. కాగా, మరో సెమీ ఫైనల్‌లో వెస్నినా 28వ ర్యాంక్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడినొవిచ్‌పై 6-3, 6-4 ఆధిక్యంతో సునాయాసంగా విజయం సాధించింది. టైటిల్ పోరులో వెస్నినాదే పైచేయి అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వైదొలిగిన కిర్గియోస్
ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన 15వ ర్యాంకర్ నిక్ కిర్గియోస్ క్వార్టర్ ఫైనల్స్ నుంచి వైదొలిగాడు. కండరాలు బెణకడంతో అతను బరిలోకి దిగలేకపోవడంతో, ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌ను విజేతగా ప్రకటించారు. కాగా, సెమీ ఫైనల్‌లో 17వ ర్యాంక్ ఆటగాడు జాక్ సాక్‌తో ఫెదరర్ తలపడతాడు. అంతకు ముందు సాక్ 6-3, 2-6, 6-2 స్కోరుతో కెయ్ నిషికొరిని ఓడించి సెమీస్ చేరాడు. ఇలావుంటే, రెండో సెమీ ఫైనల్‌లో పాబ్లో కరెనో బస్టా, స్టానిస్లాస్ వావ్రిన్కా ఢీ కొంటారు.

చిత్రం..స్వెత్లానా కుజ్నెత్సొవా