క్రీడాభూమి

ఓడినందుకు ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో బెంగాల్‌ను ఢీకొన్న జార్ఖండ్ ఓటమిపాలుకావడం ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నిరాశకు గురి చేసివుండవచ్చుగానీ, అతని స్వస్థలమైన రాంచీలో మాత్రం హర్షం వ్యక్తమవుతున్నది. మొట్టమొదటిసారి రాంచీలోని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (జెఎస్‌సిఎ) మైదానం ఒక టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తుండగా, ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ధోనీ కనీసం మ్యాచ్‌ని చూసేందుకు హాజరవుతాడని అభిమానులు ఆశించారు. కానీ, విజయ్ హజారే టోర్నీలో ఆడుతున్నందున అతను రాలేకపోయాడు. ఒకవేళ జార్ఖండ్ ఫైనల్ చేరివుంటే, సోమవారం నాటి పోరు కోసం అతను ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చేది. కానీ, జార్ఖండ్ సెమీస్‌లోనే నిష్క్రమించడంతో ధోనీ రాంచీ చేరుకునే అవకాశాలున్నాయి. అతను నగరానికి వస్తే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ని చూసేందుకు వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే, విజయ్ హజారే టోర్నీలో జార్ఖండ్ సెమీస్ నుంచి నిష్క్రమించడం పట్ల వారంతా ఆనందిస్తున్నారు. అభిమాన క్రికెటర్‌ను చూసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు.