క్రీడాభూమి

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: న్యూజిలాండ్‌తో సోమవారం జరిగే చివరి వనే్డ సిరీస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించిన ఫాస్ట్ బౌలర్ జోల్ పారిస్ అన్నాడు. తుది జట్టులో స్థానం దక్కితే, రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందన్నాడు. భారత్‌తో జరిగిన వనే్డ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. అయతే, ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ గాయపడడంతో అతని స్థానంలో పారిస్‌కు జట్టులో అవకాశం లభించింది. కివీస్ జట్టులో ఎంతో మంది ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారని అంటూ, అలాంటి జట్టుతో ఆడినప్పుడే మన శక్తిసామర్థ్యాలు బయటపడతాయని పారిస్ విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దూకుడును అడ్టుకోగలనన్న నమ్మకం తనకు ఉందన్నాడు. చాలాకాలంగా తాను చేస్తున్న కృషికి సత్ఫలితాలు వస్తాయనే అనుకుంటున్నట్టు పారిస్ తెలిపాడు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం లేదని, అయితే, పేస్ బౌలింగ్‌కు సహకరించే పిచ్‌ల స్వభావాన్ని ఉపయోగించుకొని మెరుగైన బౌలింగ్‌తో రాణిస్తానని అన్నాడు. ఇలావుంటే, భారత్‌తో జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టినప్పుడు 23 ఏళ పారిస్‌కు మాజీ పేసర్ గ్లేన్ మెక్‌గ్రాత్‌కు ఉండే 11వ నంబర్ జెర్సీ లభించింని. వనే్డల్లో 381, టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టి, అసాధారణ ప్రతిభావంతుడిగా పేరు సంపాదించిన మెక్‌గ్రాత్ ధరించిన జెర్సీ నంబరే తనకు లభించడం పట్ల పారిస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మెక్‌గ్రాత్‌తో పోల్చుకునే స్థాయి తనకు లేదని, అయితే, అతని మాదిరిగానే పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తానని పారిస్ అన్నాడు. కాగా, కివీస్‌తో మూడు మ్యాజ్‌ల సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా మొదటి వనే్డని 159 పరుగుల తేడాతో కోల్పోయంది. అయతే, రెండో మ్యాచ్‌ని 4 వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో, చివరిదైన మూడో వనే్డ ప్రాధాన్యతను సంతరించుకుంది.