క్రీడాభూమి

మాక్స్‌వెల్ వెటకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: భారత్, క్రికెట్ ఆటగాళ్ల మధ్య ఘర్షణ పూర్వక వాతావరణానికి తెరపడలేదు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ చిత్రమైన హావభావాలను ప్రదర్శించి వెక్కిరిస్తే, మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్ ప్రతీకారం తీరుకునే రీతిలో వ్యవహరించాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డైవ్ చేయడంతో భుజానికి బలమైన గాయం తగిలినప్పుడు విరాట్ కోహ్లీ అల్లాడాడు. ఎడమచేత్తో కుడి భుజాన్ని పట్టుకొని, తన బాధను తెలియచేశాడు. కాగా, శనివారం మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాక్స్‌వెల్ కూడా అదే విధంగా కుడి భుజాన్ని ఎడమ చేత్తో పట్టుకొని పరోక్షంగా కోహ్లీని వెక్కిరించాడు. రెండు జట్ల మధ్య ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతున్నదనడానికి ఇదో నిదర్శనం.

చిత్రాలు..భుజం గాయంతో అల్లాడిన కోహ్లీ..
అతనిని అనుకరిస్తున్న ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్