క్రీడాభూమి

భారత బాక్సింగ్ కోచ్‌గా నివా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: భారత పురుషుల బాక్సింగ్‌కు విదేశీ కోచ్‌గా స్వీడన్‌కు చెందిన సాంటియాగో నివాను నియమించారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) కోచ్‌ల కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న నివాకు ‘స్టార్ త్రీ’ కోచ్ హోదా కూడా ఉంది. అతని పేరును ఎఐబిఎ ప్రతిపాదించగా, తాము ఖరారు చేసినట్టు భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపాడు. స్వీడన్‌కు నివా చాలాకాలం బాక్సింగ్ కోచ్‌గా వ్యవహరించిన విషయాన్ని ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అజయ్ గుర్తచేశాడు. ఇలావుంటే, అర్జెంటీనాలో పుట్టిన నివా ఆతర్వాత స్వీడన్‌కు వలస వెళ్లాడు. అక్కడే బాంటమ్ వెయిట్, ఫెడర్‌వెయిట్ విభాగాల్లో బాక్సర్‌గా ఎదిగాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలు స్వీడన్ జాతీయ బాక్సింగ్ కోచ్‌గా ఉన్నాడు. క్యూబాకు చెందిన ఫెర్నాండెస్ 2014లో స్వదేశానికి వెళ్లిన తర్వాత భారత హాకీ కోచ్ పదవికి ఎవరినీ ఎంపిక చేయలేదు. బిఎఫ్‌ఐకి ఇటీవలే ఎఐబిఎ గుర్తింపు లభించిన తర్వాత నియామకాల వేగం పెరిగింది. ఈ క్రమంలోని విదేశీ కోచ్‌గా నివాను నియమించారు.