క్రీడాభూమి

ఎంసిఎ ‘శాశ్వత హోదా’కు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళను దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఒఎ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ క్రికెట్‌లో పవర్ హౌస్‌గా వెలిగిపోతున్న ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ)కు షాకిచ్చింది. బోర్డు నిబంధనావళిలో మార్పులను సిఒఎ ఆదివారం ఖారారు చేసింది. మారిన నిబంధనల ప్రకారం, ఇన్నాళ్లూ ఎంసిఎకు ఉన్న శాశ్వాత ఓటింగ్ హోదాకు తెరపడింది. తెలంగాణ, ఉత్తరాఖండ్‌లకు శాశ్వత సభ్యత్వం లభించింది. అదే విధంగా దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఈశాన్య రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇవ్వాలని సిఒఎ తీర్మానించింది. ‘సెవెన్ సిస్టర్స్’గా పిలిచే మణిపూర్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, త్రిపురతోపాటు అస్సాం రాష్ట్రానికి కూడా బిసిసిఐలో శాశ్వత సభ్యత్వం, ఓటు హక్కు లభిస్తాయి. బిసిసిఐ గతంలో వేటు వేసిన బీహార్ క్రికెట్ సంఘానికి కూడా సిఒఎ ఓటు హక్కు కల్పించింది. అయితే, పెండింగ్‌లో ఉన్న కేసులు పూర్తయిన తర్వాత ఆ సంఘం తన పనిని మొదలుపెడుతుందని సిఒఎ అప్‌లోడ్ చేసిన నిబంధనావళి సవరణలతో స్పష్టమవుతున్నది. రికార్డు స్థాయిలో 41 పర్యాయాలు రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబయి ఇకపై అనుబంధ సభ్యత్వానికి పరిమితమవుతుంది. గుజరాత్ మాతృ సంఘంగా ఉన్న బరోడా, సౌరాష్ట్ర క్రికెట్ సంఘాలతోపాటు ఎంసిఎకు కూడా రొటేషన్ విధానంలో ఓటింగ్ హక్కు లభిస్తుంది. బోర్డు సర్వసభ్య సమావేశంలో పాల్గొనే అవకాశం ఎంసిఎ ప్రతినిధికి ఉంటుంది. కానీ, ఓటు హక్కు మాత్రం ఉండదు.
ప్రాక్సీ విధానం రద్దు
ఇకపై బోర్డు సమావేశాల్లో గైర్హాజరయ్యే సంఘాలకు, తమ తరఫున ఇతరులకు ఓటు వేసే అధికారాన్ని ఇవ్వడానికి వీలుండదు. ప్రాక్సీ ఓటింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు సిఒఎ స్పష్టం చేసింది. ఆయా సంఘాలకు చెందిన అధికారిక ప్రతినిధులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీలోగా వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, పాలక మండలికి ప్రతి మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని తీర్మానించింది. అదే విధంగా పాలక మండలిలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉంటారని, వీరిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరుగుతుందని వివరించింది. మిగతా నాలుగు పోస్టులను బిసిసిఐ నుంచి ఒకరు, ఆటగాళ్ల నుంచి ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తరఫున ఒకరితో భర్తీ చేస్తారు. బోర్డు రోజువారీ వ్యవహారాలను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పర్యవేక్షిస్తాడు. అతనికి ఆరుగురు మేనేజర్లు సహకరిస్తారు. సెలక్షన్ కమిటీ విధానంలో సిఒఎ మార్పులు చేయలేదు. గతంలో మాదిరిగానే ఇక ముందు కూడా సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు కాస్టింగ్ ఓటు ఉంటుంది. జట్టు కెప్టెన్ సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనవచ్చు. కానీ, అతనికి ఓటు హక్కు ఉండదు. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కెప్టెన్, వైస్-కెప్టెన్, కోచ్ సెలక్టర్ల బాధ్యతలు నిర్వరిస్తారు.