క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టైటిల్ సాధిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 19: గతంలో నాలుగు పర్యాయాలు ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించిన తాను మరోసారి విజేతగా నిలుస్తానని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ధీమా వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్‌లో జాక్ సాక్‌ను 6-1, 7-6 తేడాతో ఓడించి ఫైనల్ చేరిన అతను తన దేశానికే చెందిన స్టానిస్లాస్ వావ్రిన్కాతో జరిగే తుది పోరు హోరాహోరీగా ఉంటుందని విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు. రెండో సెమీ ఫైనల్‌లో వావ్రిన్కా 6-3, 6-2 ఆధిక్యంతో పాబ్లో కారెనో బస్టాను సునాయాసంగా ఓడించాడు. కాగా, చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌ను నాలుగో రౌండ్‌లో 6-2, 6-3 తేడాతో ఓడించిన ఫెదరర్ ఇప్పుడు హాట్ ఫేవరిట్‌గా మారాడు. జాక్ సాక్‌పై గెలిచిన తర్వాత టైటిల్ సాధించే అవకాశాలను పెంచుకున్నాడు. అయితే, వావ్రిన్కాను సమర్థుడిగా అభివర్ణించిన ఫెదరర్ టైటిల్ కోసం తీవ్రమైన పోటీ తప్పదని అన్నాడు. కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఫెదరర్ ఒక ప్రశ్నపై స్పందిస్తూ ఇప్పుడు ర్యాంకింగ్‌ను మెరుగు పరచుకోవడం కంటే, ఆటను అనుక్షణం ఆస్వాదించడమే ఎక్కువ ఆనందాన్నిస్తుందని చెప్పాడు. ఇండియన్ వెల్స్‌లో అతను 2004, 2005, 2006, 2012 సంవత్సరాల్లో టైటిల్ సాధించాడు. ఐదు పర్యాయాలు విజేతగా నిలిచిన నొవాక్ జొకోవిచ్ రికార్డుకు అతను ఒక టైటిల్ దూరంలో ఉన్నాడు.

చిత్రం..రోజర్ ఫెదరర్