క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ విజేతలు ఫెదరర్, వెస్నినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషులు, మహిళల విభాగాల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్, 14వ ర్యాంకర్ ఎలెనా వెస్నినా తమ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న ప్రత్యర్థులను ఓడించి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఇద్దరూ తమతమ దేశాలకు చెందిన వారితోనే తుది పోరాటాన్ని కొనసాగించడం గమనార్హం. తొమ్మిదో ర్యాంక్ ఆటగాడిగా బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ వీరుడు ఫెదరర్ ఫైనల్‌లో తన దేశానికే చెందిన మూడో ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రిన్కాను 6-4, 7-5 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. పోరు తీవ్ర స్థాయిలో ఉంటుందని, భారీ విజయాలను నమోదు చేయడంలో దిట్టగా పేరుపొందిన వావ్రిన్కా టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతాడని అభిమానులు ఆశించారు. కానీ, అతను తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్టు కనిపించింది. పదేపదే పొరపాట్లు చేస్తూ, మొదటి సెట్‌ను ఎలాంటి పోరాటం లేకుండానే చేజార్చుకున్నాడు. మ్యాచ్‌పై ఆశలు సీజవంగా నిలబెట్టుకోవడానికి రెండో సెట్‌లో తుది క్షణం వరకూ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతర్జాతీయ కెరీర్‌లో అపారమైన అనుభవం ఉన్న ఫెదరర్ ఆ సెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని, టైటిల్ అందుకున్నాడు.
మహిళల ఫైనల్‌లో రష్యా క్రీడాకారిణులు వెస్నినా, స్వెత్లానా కుజ్నెత్సొవా ఢీకొన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో 14వ సీడ్ వెస్నినా 6-7, 7-5, 6-4 తేడాతో ఎనిమిదో ర్యాంకర్ కుజ్నెత్సొవాను ఓడించింది. పురుషుల ఫైనల్‌తో పోలిస్తే, మహిళల టైటిల్ పోరు ఆసక్తికరంగా సాగింది. అయితే, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఈ టోర్నీకి గాయం కారణంగా గైర్హాజరుకావడం, మిగతా స్టార్లు ఫైనల్ చేరలేక నిష్క్రమించడంతో వెస్నినా, కుజ్నెత్సొవా పోటీని తిలకించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. ఖాళీ సీట్లు వెక్కిరిస్తుండగా, ఎవరూ ఆసక్తి ప్రదర్శించని ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగడం విశేషం.

**
మొత్తం 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పి, ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా ప్రశంసలు అందుకుంటున్న ఫెదరర్ కెరీర్‌లో 90వ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. టెన్నిస్ ఓపెన్ శకంగా మారిన తర్వాత, పురుషుల సింగిల్స్‌లో ఎక్కువ టైటిళ్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. జిమీ కానర్స్ 109, ఇవాన్ లెండిల్ 94 టైటిళ్లతో వరుసగా మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. కాగా, ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సాధించిన ఆటగాళ్లలో ఎక్కువ యసున్న వాడిగా 35 ఏళ్ల, ఐదు నెలల ఫెదరర్ రికార్డు సృష్టించాడు.