క్రీడాభూమి

27 వికెట్ల జడేజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: రవీంద్ర జడేజా ఈఏడాది ఇంత వరకూ నాలుగు టెస్టులు ఆడాడు. అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 23 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, అతను స్వదేశంలో ఆడిన 21 టెస్టుల్లో మొత్తం 117 వికెట్లు కూల్చాడు.
* జడేజా ఈ టెస్టులో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 178 పరుగులిచ్చిన అతను తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అంతేగాక, మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం లభించలేదు. నిరుడు డిసెంబర్‌లో, ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి పది వికెట్లు సాధించాడు.
* ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను జడేజా అవుట్ చేయడం గత ఐదు ఇన్నింగ్స్‌లో ఇది నాలుగోసారి. 2013 లో ఢిల్లీ టెస్టులో స్మిత్ వికెట్ సాధించిన అతను తాజా సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లోనూ స్మిత్‌ను అవుట్ చేశాడు.
* గత ఐదు మ్యాచ్‌ల ఫలితాలను చూస్తే, మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2014-15లో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులు, తాజాగా రాంచీ టెస్టు డ్రాకాగా, పుణే మ్యాచ్‌ని ఆస్ట్రేలియా 333 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. బెంగళూరు టెస్టును భారత్ 75 పరుగుల ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంది.

* పీటర్ హ్యాండ్స్‌కోమ్ విదేశాల్లో ఒక టెస్టు హాఫ్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. కాగా, అతనికి ఇది మూడో అర్ధ శతకం. స్వదేశంలో అతను దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు.
* ఐదో వికెట్‌కు హ్యాండ్స్‌కోమ్, షాన్ మార్ష్ కలిసి 124 పరుగుల భాగస్వామ్యాన్ని అందించే క్రమంలో 373 బంతులు ఎదుర్కొన్నారు. భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు ఆడిన జోడీగా వీరు చరిత్ర సృష్టించారు. 2004లో చెన్నైలో జరిగిన టెస్టులో ఐదో వికెట్‌కు జాసన్ గిలెస్పీ, డామియన్ మార్టిన్ 336 బంతులు ఎదుర్కోగా, హ్యాండ్స్‌కోమ్, షాన్ మార్ష్ ఆ రికార్డును అధిగమించారు.
* షాన్ మార్ష్ భారత్‌పై నాలుగవ, మొత్తం మీద ఏడో అర్ధ శతకాన్ని సాధించా డు. తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్‌లో 55.55 సగటుతో అతను 500 పరుగులు చేశాడు.