క్రీడాభూమి

కామనె్వల్త్ క్రీడల కోసం పోటీ సబబు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: చాలా దేశాలు ఇప్పటికే పోటీలో ఉన్నందున 2022లో జరిగే కామనె్వల్త్ క్రీడల కోసం మన దేశం పోటీ పడదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ రామంచద్రన్ మంగళవారం స్పష్టం చేశారు. ‘బరిలో చాలా మంది ఉన్నారు. కామనె్వల్త్ గేమ్స్ నిర్వహణనుంచి వైదొలుగుతామని డర్బన్ చెబుతున్నప్పటికీ ఆ నగరం ఇప్పటివరకు అధికారికంగా వైదొలగలేదు. కామనె్వల్త్ గేమ్స్ కమిటీ ఇంకా దక్షిణాఫ్రికాతో చర్చలు జరుపుతోంది’ అని మంగళవారం ఇక్కడ క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్‌తో భేటీ అనంతరం రామచంద్రన్ చెప్పారు. కామనె్వల్త్ గేమ్స్‌ను లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లలో నిర్వహించాలని అనుకుంటున్నామని చెప్తూ బ్రిటన్ కూడా ముందుకు వచ్చిందని, అందువల్ల ఈ దశలో భారత్ ఈ క్రీడలకోసం ప్రతిపాదన చేయడం సబబు కాదని ఆయన చెప్పాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆర్థిక హామీ ఇవ్వకపోవడంతో డర్బన్ కామనె్వల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును సోమవారం వదులుకొన్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో డర్బన్ స్థానంలో ఈ పోటీలను నిర్వహించే అవకాశాలను ఐఓఏ పరిశీలిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. కాగా, ఈ నెల 25నుంచి ఢిల్లీలో జరగాల్సిన గ్రామీణ క్రీడోత్సవాల గురించి అడగ్గా, ఈ క్రీడలు వాయిదా పడినట్లు విజయ్ గోయల్ చెప్పాడు. తాము రెండు నెలల క్రితమే ఈ క్రీడల గురించి ప్రణాళికలు కూడా రూపొందించుకున్నామని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వీటిని రాజకీయాలతో ముడిపెట్టి, స్టేడియంలు ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన చెప్పాడు. ఎన్నికలు ముగిసినందున దీనికోసం సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పాడు.