క్రీడాభూమి

ధర్మశాలలో ఆసీస్‌దే పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 22: ధర్మశాలలో జరిగే చివరి, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందని, ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఆ పిచ్‌పై భారత్‌కు కష్టాలు తప్పవని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ జోస్యం చెప్పాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ధర్మశాల వికెట్‌పై ఉన్న పచ్చిన పేసర్లకు ఉపయోగపడుతుందని అన్నాడు. స్పిన్నర్లకు అంతగా అనుకూలించని పిచ్‌పై టీమిండియా ఎంత వరకూ రాణిస్తుందనేది అనుమానమేనని వ్యాఖ్యానించాడు. పుణే టెస్టులో ఆస్ట్రేలియాను గెలిపించిన స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్‌ను తప్పించి, చివరి టెస్టులో ఫేసర్ జాక్సన్ బర్ట్‌ను ఆడించాలని సూచించాడు.
టీమిండియాకు ఓటమి భయం: స్టార్క్
భారత క్రికెట్ జట్టుకు సిరీస్‌ను కోల్పోతామన్న భయం వెంటాడుతున్నదని, ఆ జట్టు ఆటగాళ్ల వివాదాస్పద వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. గాయం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన అతను ప్రస్తుతం మెల్బోర్న్‌లో పునరావాస కేంద్రంలో ఫిట్నెస్‌ను మెరుగుపరచుకుంటున్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ సొంతగడ్డపై ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంటామన్న ఆందోళనతో టీమిండియా క్రికెటర్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు. తమను చూసి భారత ఆటగాళ్లు భయపడుతున్నారని, అందుకే ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు.