క్రీడాభూమి

ఇండియా బ్లూ, రెడ్ క్రికెట్ జట్లకు విశాఖలో ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (స్పోర్ట్స్) మార్చి 23: దేవధర్ ట్రోపీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఇండియా బ్లూ, ఇండియా రెడ్ జట్లు గురువారం విశాఖ చేరుకున్నాయి. విశాఖ విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు స్వాగతం పలుకగా వీరికి ఆతిథ్యం ఇస్తున్న నొవాటెల్, గ్రీన్‌పార్కు హోటల్‌లో సంబంధిత సిబ్బంది సాంప్రదాయరీతిలో తిలకం దిద్ది పూలదండలతో ఆహ్వానం పలికారు. ఇక్కడి ఏసిఏ-విడిసిఏ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో ఇండియా బ్లూ, రెడ్ జట్లతోపాటు విజయ్ హజరే ట్రోపీ విజేత తమిళనాడు జట్ల తలపడనున్నాయి. తొలిసారిగా విశాఖలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇండియా బ్లూ జట్టుకు రోహిత్‌శర్మ, రెడ్ జట్టుకు పార్దివ్ పటేల్, తమిళనాడు జట్టుకు విజయశంకర్ సారథ్యం వహించనున్నారు. ఇండియా బ్లూ, ఇండియా రెడ్ జట్ల మధ్య ఈ నెల 25న తొలిమ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. 26న ఇండియా రెడ్-తమిళనాడు, 27న ఇండియా బ్లూ-తమిళనాడు, 28న రెస్ట్ డే, 29న ఫైనల్ పోటీ జరుగుతుంది. ఇండియా బ్లూ,రెడ్ జట్లు శుక్రవారం ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో సాధన చేస్తాయి. శుక్రవారం తమిళనాడు జట్టు విశాఖ చేరుకోనుంది. ఈ పోటీల నుండి ఐసిసి ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొనే భారత్ జట్టు ఎంపిక కూడా జరుగనుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది ప్రముఖ క్రికెటర్లు ఈ పోటీల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
జట్ల వివరాలు
ఇండియా బ్లూ: రోహిత్‌శర్మ (కెప్టెన్), మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్‌హూడా, హర్భజన్ సింగ్, క్రుణాల్‌పాండ్య, షహబాజ్, నదీమ్, సిద్ధార్థ్‌కౌల్, శాద్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, పంకజ్‌రావ్.
ఇండియా రెడ్: పార్థీవ్ పటేల్ (కెప్టెన్, వికెట్‌కీపర్), శిఖర్ ధావన్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, కేదర్ జాదవ్, ఇషాంక్ జగ్గీ, గురుకీరత్ సింగ్ మాన్, అక్షర్ పటేల్, అక్షయ్ కార్నేవార్, అశోక్ దిండా, కుల్వంత్ కెజిరోలియా, ధవళ్ కులకర్ణి, గోవింద్ పొడ్డార్
తమిళనాడు : విజయ్‌శంకర్ (కెప్టెన్) దినేష్‌కార్తీక్, గంగా శ్రీ్ధర్‌రాజు, ఇంద్రజిత్, సూర్యప్రకాశ్, కౌశిక్ గాంధీ, జగదీశన్ కౌశిక్, మహ్మాద్, ఆంథోనిదాస్, ఆర్. రోహిత్, రాహిల్ షా, అశ్విన్, సాయి కిశోర్, వాషింగ్టన్ సుందర్.

చిత్రాలు..విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఇండియా బ్లూ, రెడ్ క్రికెటర్లు. ఈ రెండు జట్లు దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఢీ కొంటాయ