క్రీడాభూమి

అతను గొప్ప కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 23: విరాట్ కోహ్లీపై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మాజీ కెప్టెన్లు మాత్రం అతనిని అభినందిస్తూ, బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. కోహ్లీని గొప్ప నాయకుడిగా ఆసీస్ ‘లెజెండ్’ ఆడం గిల్‌క్రిస్ట్ గురువారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభివర్ణించాడు. జట్టునే కాదు.. యావత్ దేశాన్ని కూడా తన వెనకాల రప్పించుకునే ప్రతిభ కోహ్లీకి మాత్రమే సొంతమని వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో ఇంత వరకూ కోహ్లీ రాణించలేకపోయినా, ఏ క్షణంలోనైనా అతను ఫామ్‌లోకి వస్తాడని గిల్‌క్రిస్ట్ జోస్యం చెప్పాడు. అతను రెచ్చిపోయి ఆడితే, ఆతర్వాత పరుగుల వరదను ఆపడం సులభసాధ్యం కాదని, ఒక రకంగా ఈ భయమే తనను వెంటాడుతున్నదని అన్నాడు. ప్రస్తుత సిరీస్ హోరాహోరీగా సాగడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. రెండు ఉత్తమ జట్ల మధ్య పోరు ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందనేది ఈ సిరీస్ స్పష్టం చేస్తున్నదని చెప్పాడు.
మా లక్షణాలు ఉన్నాయి..
కెప్టెన్‌గా కోహ్లీలో తనతోపాటు రికీ పాంటింగ్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. ఆసీస్ జట్టుకు స్టీవ్ వా తర్వాత పాంటింగ్ నాయకత్వం వహించాడు. టీమిండియాను కోహ్లీ నడిపిస్తున్న తీరును చూస్తుంటే, తన కెప్టెన్సీ విధానం గుర్తుకొస్తున్నదని స్టీవ్ వా అన్నాడు. అంతేగాక, కొన్ని సందర్భాల్లో అతను పాంటింగ్‌ను మరపిస్తున్నాడని చెప్పాడు.