క్రీడాభూమి

కోహ్లీ నెట్స్‌కు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 23: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం నెట్స్‌కు దూరంగా ఉన్నాడు. మిగతా ఆటగాళ్లంతా తొలుత రొటీన్ వామప్‌లో, ఆతర్వాత నెట్స్‌లో శ్రమించగా, చేతికి బ్యాండేజీ వేసుకొని కనిపించిన కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అతను వామప్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్ పర్యవేక్షణలో అతను కొంత సేపు రొటీన్ ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. పలుమార్లు ఫర్హత్‌ను సంప్రదించి, అతని సూచనలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు పూర్తికాగా, ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీగా ఉన్నాయి. దీనితో చివరిదైన నాలుగో టెస్టు అత్యంత కీలకంగా మారింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. అయితే, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక బౌండరీని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు భుజానికి గాయమైన కోహ్లీ నెట్స్‌కు దూరంగా నిలబడి, సహచరుల ప్రాక్టీస్ సెషన్‌ను గమనించాడు. శుక్రవారం కూడా టీమిండియా ప్రాక్టీస్‌కు హాజరైనప్పుడు కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కోహ్లీ ఇప్పుడు గాయపడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. అతను బ్యాండేజీతో కనిపించడంతో, చివరి టెస్టు ఆడతాడా లేదా అన్న అనుమానం తలెత్తుతోంది. అయితే, పట్టుదలకు మారుపేరైన అతను తప్పనిసరిగా మ్యాచ్ ఆడతాడన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దీనికితోడు, ఇది ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో, అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మైదానంలోకి దిగుతాడని అంటున్నారు. మొత్తం మీద కోహ్లీ గాయం చివరి టెస్టు ఆరంభానికి ముందు చర్చనీయాంశమైంది.
చివరి టెస్టుకు షమీ అనుమానమే!
రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ చివరి టెస్టులో ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. అతను కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాడని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. కానీ, అతను పూర్తిగా కోలుకున్న ఆధారాలు కనిపించడం లేదని, అందుకే, చివరి టెస్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన విజయ్ హజారే టోర్నమెంట్‌లో మూడు గ్రూప్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌లోనూ షమీ ఆడాడు. అందులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ, పునరావాస వ్యాయామ ప్రక్రియలో భాగంగానే ఆ టోర్నీలో షమీని ఆడించామని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద చివరి టెస్టులో షమీ ఆడడం అనుమానంగానే ఉంది. అతను బరిలో దిగకపోతే, ఫాస్ట్ బౌలింగ్ విభా గాన్ని ఇశాంత్ శర్మ నేతృత్వంలోనే కోహ్లీ కొన సాగించవచ్చు.

చిత్రాలు..రొటీన్ ప్రాక్టీస్‌లో నిమగ్నమైన భారత క్రికెటర్లు
*ఓపెనర్ డేవిడ్ వార్నర్ (కుడి)తో కలిసి నెట్ ప్రాక్టీస్‌కు వస్తున్న ఆసీస్ కెప్టెన్ స్మిత్