క్రీడాభూమి

అద్భుతాన్ని సాధించండి: బార్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 24: టీమిండియాను భారత్‌లోనే టెస్టు సిరీస్‌లో ఓడించడం ద్వారా ఒక అద్భుతాన్ని సాధించాల్సిందిగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ అలాన్ బార్డర్ పిలుపునిచ్చాడు. భారత జట్టును భారత్‌లోనే ఓడించడం సులభం కాదని స్పష్టం చేశాడు. అండర్ డాగ్ ముద్రతో ఈ సిరీస్‌ను మొదలుపెట్టిన ఆసీస్ ఒక మ్యాచ్‌ని గెల్చుకొని, మరో మ్యాచ్‌ని డ్రా చేసుకొని భారత్‌కు సమవుజ్జీగా నిలవడం హర్షణీయమని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. 1989లో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన తన నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టుపై ఇలాంటి ముద్రే వేశారని గుర్తుచేశాడు. ఇంత చెత్త జట్టు గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్‌లో పర్యటించలేదని విమర్శించారని, కానీ, ఆ సిరీస్‌ను తాము 4-0 తేడాతో గెల్చుకున్నామని అన్నాడు. అదే రీతిలో ఇప్పుడు కెప్టెన్సీలో భారత్ వెళ్లిన జట్టు సిరీస్ విజయంతో రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
భారత్‌పైనే ఒత్తిడి: స్టీవ్ వా
చివరిదైన నాలుగో టెస్టులో భారత జట్టు తీవ్రమైన ఒత్తిడిలో బరిలోకి దిగుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా జోస్యం చెప్పాడు. అన్ని విభాగాల్లోనూ భారత్‌కు స్మిత్ బృందం గట్టిపోటీనిస్తున్నదని అన్నాడు. స్వదేశంలో సిరీస్‌ను గెల్చుకోలేకపోతే పరువు పోతుందనే భయం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను వేధిస్తుంటుందని, ఆసీస్‌కు అలాంటివేవీ లేవన్నాడు. ఓపెనర్ వార్నర్ ఫామ్‌లోకి వస్తాడని స్టీవ్ వా ధీమా వ్యక్తం చేశాడు. అత ను పరుగుల వేట మొదలుపెడితే, ఆసీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు కష్టమవుతుందన్నాడు. మూడో టెస్టు ఆడిన జట్టునే ఎలాంటి మార్పు లేకుండా చివరి టెస్టులోనూ కొనసాగించాలని సూచించాడు.