క్రీడాభూమి

జట్టులో షమీ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 24: గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పేరును చివరి టెస్టుకు భారత అధికారులు అధికారికంగా జట్టు జాబితాలో చేర్చారు. దీనితో అతను ఈ మ్యాచ్ ఆడతాడన్న వాదన బలపడుతున్నది. కాలి గాయంతో బాధపడిన షమీ, కోలుకున్న తర్వాత విజయ్ హజారే టోర్నీలో ఆడాడు. దీనితో అతని ఫిట్నెస్‌పై అనుమానాలు లేవని సెలక్షన్ కమిటీ భావిస్తున్నది. అయితే, శనివారం ఉదయం మ్యాచ్ ఆరంభానికి ముందు ఫిట్నెస్‌ను పరీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇలావుంటే, ఒకవేళ షమీ జట్టులోకి వస్తే, మరో ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఫామ్‌లో ఉన్న ఉమేష్ యాదవ్‌ను తొలగించే ప్రయత్నం జరగదని, ఇశాంత్‌పైనే వేటు పడుతుందని విశే్లషకులు అంటున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై బంతి బాగా స్వింగ్ అవుతుందని అంటున్నారు. అదే నిజమైతే, ఇశాంత్ కంటే షమీకే ఈ పిచ్ అనుకూలిస్తుంది. ఈ కోణంలో చూసినా షమీకి అవకాశం లభించడం ఖాయం.