క్రీడాభూమి

మనోహర్ రాజీనామాకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 24: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ, శశాంక్ మనోహర్ మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగుతాడు. ఈ ఏడాది జరిగే వార్షిక సమ్మేళనం ముగిసే వరకూ బాధ్యతలను నిర్వర్తించాల్సిందిగా కోరుతూ ఐసిసి పాలక మండలి చేసిన తీర్మానానికి మనోహర్ సానుకూలంగా స్పందించాడు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలన్న తన నిర్ణయంలో మార్పులేదని అతను ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. అయితే, పాలనా వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో, కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ తాను సేవలు అందిస్తానని తెలిపాడు. ఐసిసి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈనెల 15వ తేదీన మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను వ్యక్తిగత కారణాలను పేర్కొంటున్నప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కొనసాగుతున్న విభేదాలే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్నకు బిసిసిఐతో విభేదాలన్న ఒకే ఒక సమాధానం వినిపిస్తున్నది. ఇలావుంటే, వార్షిక సదస్సు జరిగే వరకూ మనోహర్ పదవిలోనే కొనసాగితే, అతను చేసిన పలు ప్రతిపాదనలకు అమోద ముద్ర పడే అవకాశం ఉంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో కూడిన ‘బిగ్ త్రీ’ దేశాలకు ఉన్న ప్రత్యేక ఆర్థిక హక్కులు, భారీ వాటాలపై వేటు వేసేందుకు అతను ఇప్పటికే రంగం సిద్ధం చేశాడు. అయితే, బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ బోర్డుల మద్దతును బిసిసిఐ కూడగట్టుకోవడంతో, అతని సంస్కరణలకు ఆమోదం లభిస్తుందా అన్నది అనుమానాస్పదంగా మారింది. కాగా, ఇప్పుడు మనోహర్ వైదొలగడం వాయిదా పడడంతో, అతను తన ప్రదిపాదనలకు కట్టుబడి ఉంటాడన్నది వాస్తవం. అతని అధ్యతనే జరిగే ఐసిసి తదుపరి సమావేశంలో ఈ సంస్కరణలపై ఓటింగ్ జరుగుతుంది కాబట్టి, మనోహర్ అనుకుంటున్న మార్పులకు ఆమోదం లభించే అవకాశాలను పూర్తిగా కొట్టేడయడానికి వీల్లేదు. మొత్తం మీద మనోహర్ రాజీనామాతో ‘బిగ్ త్రీ’ దేశాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని ధీమాతో ఉన్న బిసిసిఐ ఇప్పుడు చోటు చేసుకున్న తాజా పరిణామంతో మళ్లీ లాబీయింగ్‌ను మొదలు పెట్టక తప్పదు. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

చిత్రం..శశాంక్ మనోహర్