క్రీడాభూమి

‘డ్రింక్స్ బాయ్’ కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తాడు. భుజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయిన అతను మ్యాచ్ ఆరంభమైన సుమారు అరగంటలోనే మైదానంలోకి పరుగులు తీశాడు. సహచరులకు డ్రింక్స్‌ను అందించాడు. రాంచీలో జరిగిన మూడో టెస్టు మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ గాయపడిన విషయం తెలిసిందే. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, అతను తనదైన శైలిలో ఆడలేకపోయాడు. ఫీల్డింగ్ సమయంలో స్లిప్స్‌లోనే నిలబడి, భుజం గాయం పెరగకుండా జాగ్రత్త పడ్డాడు. ధర్మశాలకు చేరుకున్న తర్వాత, మొదటి రెండు రోజులు అతను నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లకుండా, కేవలం రొటీన్ వామప్‌తోనే సరిపుచ్చాడు. శుక్రవారం ఉదయం చాలా తక్కువ సమయం అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, మ్యాచ్ ఆడి, ఫీల్డింగ్ చేస్తే గాయం తిరగబెడుతుందన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఫిజియో పాట్రిక్ ఫర్హత్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నందువల్ల ముందు జాగ్రత్తగా కోహ్లీకి చివరి టెస్టు నుంచి విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. 2011 నవంబర్ తర్వాత మొదటిసారి ఒక టెస్టుకు దూరమైన కోహ్లీ మైదానంలోకి వెళ్లకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మాట్ రెన్‌షా అవుటైన తర్వాత, బంతి ఆకారం మారిందంటూ భారత ఆటగాళ్లు అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. బంతిని తనిఖీ చేసే క్రమంలో లభించిన మినీ బ్రేక్‌లో కోహ్లీ డ్రింక్స్ బాటిళ్లు పట్టుకొని పరుగులు తీసి, ప్రేక్షకులను అలరించాడు.