క్రీడాభూమి

ధావన్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 25: పరుగుల వరద పారిన దేవధర్ ట్రోఫీ తొలిరోజు మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’పై, ఇండియా ‘బి’ 23 పరుగుల తేడాతో గెలిచింది. రెండు జట్లు ధాటిగా ఆడి 300 పరుగుల స్కోర్లను అధిగమించడంతో పోటీ రసవత్తరంగా సాగింది. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ సెంచరీతో (128) అలరించగా, పార్థీవ్ పటేల్, ఇశాంక్ జగ్జీ అర్ధసెంచరీలతో రాణించడంతో ఇండియా ‘బి’ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 327 పరుగుల భారీ స్కోరు సాధించింది. బదులుగా ఇండియా ‘ఎ’ జట్టులో అంబటిరాయుడు ధాటిగా ఆడి చివరి వరకు పోరాడి 92 పరుగుల చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. మిగతా వారు అదే స్థాయలో ఆడలేకపోవడంతో, ఇండియా ‘ఎ’కు ఓటమి తప్పలేదు.
ఇక్కడి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ‘ఎ’ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా ‘బి’ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ఆట ప్రారంభం నుండే స్కోరును పరుగులు తీయించాడు. మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్ సహకారం అందించడంతో ఇండియా ‘బి’ తొలి వికెట్‌కు 93 పరుగులు సాధించింది. పార్థీవ్ పటేల్ 9 బౌండరీలతో 50 పరుగులు చేయగా, హర్‌ప్రీత్‌సింగ్ భాటియా 29, అక్షర్‌పటేల్ 22 పరుగులతో సహకారం అందించారు. దీనితో ఇండియా ‘బి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 13 బౌండరీలు, 3 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు. ఇండియా ‘ఎ’ జట్టు బౌలర్లలో సిద్ధార్థ్‌కౌల్ 59 పరుగులకు 5 వికెట్లు, కృణాల్ పాండ్య 2 వికెట్లు తప్ప, మిగతా బౌలర్లు ఎవరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలువరించలేకపోయారు.
అనంతరం 328 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన ఇండియా ‘ఎ’ జట్టు ఆట ప్రారంభంలోనే 57 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అంబటిరాయుడు 8 బౌండరీలు, 2 సిక్సర్లతో 92, మయాంక్ అగర్వాల్ 34, మనోజ్ తివారీ 37, కృణాల్ పాండ్య 31, రిషభ్ పంత్ 20 పరుగులతో దీటుగా బ్యాటింగ్ చేయడంతో ఇండియా ‘ఎ’ జట్టు 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల మైలురాయిని దాటింది. చివరిలో అనూహ్యంగా దీపక్ జగ్బీర్ హుడా, సిద్ధార్థ్‌కౌల్ వికెట్లు కూలడంతో, 48.2 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఇండియా ‘బి’ జట్టు బౌలర్లలో ధవళ్ కులకుర్ణి, అక్షయ్ కర్నేవర్ చెరో 3 వికెట్లు కూల్చారు. కుల్వంత్ కెజ్రోలియా, అక్షర్‌పటేల్ చెరి రెండు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంతో తమవంతు పాత్ర పోషించారు.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మూడో టెస్టుకు
వర్షం బెడద
హామిల్టన్, మార్చి 25: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఎక్కువ భాగం ఆటకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. మొత్తం మీద 41 ఓవర్ల ఆట సాధ్యంకాగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 123 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గార్ (5), డి బ్రూయిన్ (0) నిరాశపరచగా, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా 50 పరుగులు చేశాడు. జెపి డుమినీ 20 పరుగులకు వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ 33, టెంబా బవూమా 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.