క్రీడాభూమి

లంకతో పోరుకు ధోనీ సేన సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: శ్రీలంకతో పోరుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధంగా ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాను టి-20 సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ధోనీ సేన, లంకతో టి-20 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టి-20 మ్యాచ్ మంగళవారం జరగనుంది. ఈ నెల చివరిలో జరిగే ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్, మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగే టి-20 ప్రపంచ కప్ పోటీలకు అవసరమైన అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి లంకతో జరిగే సిరీస్ భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చినప్పటికీ, భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే కనిపిస్తున్నది. రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ క్రమంగా ఫామ్‌లోకి వస్తున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఎంతటి భాగస్వామ్యాన్ని అందిస్తారన్న అంశంపైనే భారత్ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వీరు విఫలమైనా, సురేష్ రైనా, కెప్టెన్ ధోనీ, ఇటీవలే మళ్లీ జట్టులో స్థానం సంపాదించిన యువరాజ్ సింగ్, గాయాల సమస్య నుంచి బయటపడిన ఆజింక్య రహానే, మనీష్ పాండే వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది. ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ పోటీల్లో రాణించాలంటే శ్రీలంకతో సిరీస్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు పాండే తయారవుతున్నాడు.
పటిష్టమైన బౌలింగ్
బ్యాటింగ్‌తో పోలిస్తే భారత బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా ఉందనే అభిప్రాయం నెలకొంది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌లో టీమిండియాను గెలిపించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా, యువ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చక్కటి ఆటతో సెలక్టర్లను ఆకట్టుకున్నారు. ఆసియా కప్, టి-20 వరల్డ్ పోటీలకు ఎంపిక చేసిన జట్లలో స్థానం లభించని భువనేశ్వర్ కుమార్ లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, అతనికి తుది జట్టులో అవకాశం కల్పిస్తారా అన్నది అనుమానమే. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎడమచేతి వాటం స్పిన్నర్ పవన్ నేగీపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద, లంకతో పోలిస్తే బౌలింగ్‌లోనూ భారత జట్టు పటిష్టంగా ఉంది.
‘యువ’లంక
శ్రీలంక జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. భారత పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడిన అనుభవం వీరిలో ఎక్కువ మందికి లేదు. దినేష్ చండీమల్ నాయకత్వంలో భారత్‌లో అడుగుపెట్టిన లంక జట్టుకు ఎవరు ఏ స్థాయిలో సేవలు అందిస్తారన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అయితే, పలువురు కీలక ఆటగాళ్లు లేనందువల్ల ఇది పూర్తి స్థాయి జట్టు కాదన్నది వాస్తవం. భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా కనిపిస్తున్న లంక మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కదానిని గెల్చుకున్నా అది అద్భుతమే అవుతుంది.

నేడు
తొలి
టి-20

థర్డ్ డౌన్‌లో రైనా
బ్యాటింగ్ ఆర్డర్‌పై ధోనీ అభిప్రాయం
పుణే, ఫిబ్రవరి 8: సురేష్ రైనా థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని భారత టి-20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో తొలి టి-20 మ్యాచ్ మంగళవారం జరగనున్న నేపథ్యంలో అతను సోమవారం పిటిఐతో మాట్లాడుతూ లంకతో సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో, అతని స్థానంలో బ్యాటింగ్ చేసే సామర్థ్యం రైనాకు ఉందని అన్నాడు. టి-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రయోజాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ టెస్టు, వనే్డ జట్లలో స్థానం సంపాదించేందుకు ఐపిఎల్ టోర్నమెంట్ కొలమానం కాదని స్పష్టం చేశాడు.