క్రీడాభూమి

భారీ స్కోరు దిశగా కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 27: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆతిథ్య నూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 67 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు మరో 16 పరుగులు సాధించిన తర్వాత ఓపెనర్ లాథమ్ (50) వికెట్‌ను కోల్పోయింది. అయితే అతని స్థానంలో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కాన్ విలియమ్‌సన్ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ జీత్ రావల్ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపిన విలియమ్‌సన్ 151 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 190 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం రావల్ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక క్వింటన్ డీకాక్‌కు క్యాచ్ ఇవ్వగా, నీల్ బ్రూమ్ (12), హెన్రీ నికోలస్ (0)లను కాగిసో రబాడ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఆ తర్వాత స్థిమితంగా ఆడిన కాన్ విలియమ్‌సన్ (148), మిచెల్ సాంట్నర్ (13) అజేయంగా మరో 28 పరుగులు జోడించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 321 పరుగులు రాబట్టిన న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా కంటే 7 పరుగుల ఆధిక్యత సాధించింది.