క్రీడాభూమి

దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 27 : వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఇండియా ‘ఎ’ జట్టు దేవధర్ ట్రోఫీ నుండి వైలదొలిగింది. కాగా కీలకమైన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు గెలుపొంది ఫైనల్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇండియా ‘బి’ జట్టుతో జరిగిన తొలిమ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసిన తమిళనాడు జట్టు ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ (93), జగదీషన్ (71) చెలరేగిపోవడంతో 73 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకున్న ఇండియా ‘బి’ జట్టు 8 పాయింట్లు, తమిళనాడు జట్టు 4 పాయింట్లు సాధించగా, ఇండియా ‘ ఎ’ జట్టు ఒక్క పాయింటు కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. బుధవారం నాటి ఫైనల్ పోటీలో తమిళనాడు జట్టు ఇండియా ‘బి’ జట్టుతో తలపడుతుంది.
ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు 6 వికెట్లు కోల్పోయి 303 పరుగుల భారీ స్కోరు సాధించింది. తమిళనాడు జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోను 300 పరుగుల స్కోరును అధిగమించడం విశేషం. దినేష్ కార్తీక్ 6 బౌండరీలతో 93, జగదీషన్ 4 బౌండరీలు, 2 సిక్సర్లతో 71 పరుగులతో చెలరేగి ఆడి 3వ వికెట్‌కు 159 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. వీరికి తోడు ఓపెనర్ కౌశిక్ గాంధీ 34, ఇంద్రజిత్ 36, విజయశంకర్ 23 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తమ సహకారం అందించారు. ఇండియా ‘ ఎ’ జట్టు బౌలర్లలో షార్దూల్ 3 వికెట్లు, సిద్ధార్థ్‌కౌల్, పాండ్యా, హర్భజన్‌సింగ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. అనంతరం బ్యాటింగుకు దిగిన ఇండియా ‘ ఎ’ జట్టు 44.4 ఓవర్లలో కేవలం 230 పరుగులు చేసి కుప్పకూలిపోయింది. 41వ ఓవర్‌కే 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులతో పటిష్ఠంగా ఉన్న ఇండియా ‘ ఎ’ జట్టు 16 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది. జట్టులో మన్‌దీప్‌సింగ్ 97 (6 బౌండరీలు, 3 సిక్సర్లు), పాండ్యా 36, దీపక్ హుడా 26, అంబటిరాయుడు 21 తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ఎదురు నిలవలేకపోయరు. తమిళనాడు బౌలర్లలో రాహుల్‌షా 37 పరుగులకు 3 వికెట్లు, సాయికిశోర్ 39 పరుగులకు 3 వికెట్ల వంతున పడగొట్టి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.

చిత్రం..తమిళనాడును ఫైనల్‌కు చేర్చిన దినేష్ కార్తీక్ (93 పరుగులు)