క్రీడాభూమి

ఫైనల్‌లో స్థానమే భారత్ లక్ష్యం (అండర్-19 వరల్డ్ కప్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, ఫిబ్రవరి 8: అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా భారత జట్టు మంగళవారం షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగే సెమీ ఫైనల్‌లో తలపడేందుకు అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసిన భారత్ అదే దూకుడును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్, సర్ఫ్‌రాజ్ ఖాన్ బ్యాటింగ్ ప్రతిభ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ టోర్నీలో పంత్ 252, సర్ఫ్‌రాజ్ 245 చొప్పున పరుగులు సాధించి సత్తా చాటారు. గత మ్యాచ్‌లో 96 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించిన 18 ఏళ్ల పంత్ మంగళవారం కూడా అదే స్థాయిలో రాణించే అవకాశాలు లేకపోలేదు. కాగా, ఇప్పటి వరకూ ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలను సాధించిన సర్ఫ్‌రాజ్ నిలకడగా రాణించడంతో అతని నుంచి భారత అభిమానులు మరోసారి అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు. జట్టు అవసరాలకు తగ్గట్టు రాణిస్తున్న అర్మాన్ జాఫర్, మహిపాల్ లొంరర్ కూడా జట్టు బలాన్ని పెంచుతున్నారు.
బౌలింగ్ విభాగానికి వస్తే ఆవేష్ ఖాన్ ఇప్పటి వరకూ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అతను తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి కృషి చేయడం ఖాయం. మహిపాల్, మాయాంగ్ దాగర్ కూడా సమర్థులే. ఆటగాళ్ల గణాంకాలు, వారి శక్తిసామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే, శ్రీలంకపై భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చరిత్ అశలంక నాయకత్వంలోని శ్రీలంక జట్టును భారత్‌తో పోల్చడానికి వీల్లేకపోయినా, తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్వార్టర్ ఫైనల్స్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన తీరే లంక సామర్థ్యానికి నిదర్శనం. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో కెప్టెన్ చరిత్ 194, ఆవిష్క ఫెర్నాండో 143 చొప్పున పరుగులు సాధించారు. బౌలర్లలో వనిదు హసరనంగ డి సిల్వ, దమిత సిల్వ ముందు వరుసలో ఉన్నారు. స్పిన్నర్ తిలన్ నిమేష్, ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో చెరి ఆరు వికెట్లు కూల్చారు. మంగళవారం నాటి మ్యాచ్‌లో వీరు భారత బ్యాట్స్‌మెన్‌ను తమ పదునైన బంతులతో ఇబ్బంది పెట్టడం ఖాయం. స్థూలంగా చూస్తే, శ్రీలంకను ఓడించి భారత్ ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, టి-20 ఫార్మెట్‌లో ఫలితాలను ముందుగా ఊహించడం అసాధ్యం. తమదైన రోజున ఎవరైనా, ఎలాంటి ఫలితాన్నయినా రాబట్టుకోవచ్చు. రెండూ ఆసియా దేశాలే కావడం, మీర్పూర్‌ను పోలిన వికెట్‌పై ఆడిన అనుభవం ఉండడంతో, మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని విశే్లషకుల అభిప్రాయం. గణాంకాలు, బలాబలాలు మాత్రం భారత్‌నే హాట్ ఫేవరిట్‌గా నిలబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి పోరు ఉత్కంఠ రేపనుంది.
పాక్ పరాజయం
ఫతుల్లాలో జరిగిన క్వార్టర్ ఫై నల్ మ్యాజ్‌లో పాకిస్తాన్ పరాజ యాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 227 పరు గులు చేసింది. ఉమర్ మసూద్ 113 పరుగులతో రాణించాడు. కానీ, అతను అందించిన అవకాశాన్ని సల్మాన్ ఫయాజ్ (55) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకో లేకపోయారు. విండీస్ బౌలర్ కెమర్ హోల్డర్ రెండు వికె ట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 40 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించిం ది. వేగంగా పరుగులు రాబట్టిన విండీస్ బ్యాట్స్‌మెన్ ఇం కా 60 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించ డం విశేషం. తెవిన్ ఇమ్లాచ్ (54), కెప్టెన్ షిమ్న్ హెట్మే యర్ (52) అర్ధ శతకాలతో రాణించి తమ జట్టును సెమీ ఫైనల్స్ చేర్చారు.