క్రీడాభూమి

ధోనీసేన విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 9: శ్రీలంక యువ జట్టుతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటవగా, శ్రీలంక జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు సాధించి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాటింగ్‌తో భారత జట్టు అన్ని విభాగాల్లో తీవ్రంగా విఫలమవడమే ఇందుకు కారణం. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9)తో పాటు ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (4) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగు తీయడంతో భారత జట్టు 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత సురేష్ రైనా (20), యువరాజ్ సింగ్ (10), రవిచంద్రన్ అశ్విన్ (31-నాటౌట్) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో భారత జట్టు 18.5 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంక బౌలర్లలో దసన్ షనక, కసున్ రజిత చెరో మూడు వికెట్లు కైవసం చేసుకోగా, దుష్మంత చమీర రెండు వికెట్లు, సచిత్ర సేనానాయకే ఒక వికెట్ సాధించారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (4), దనుష్క గుణతిలక (9)ల స్వల్పస్కోర్లకే ఆశిష్ నెహ్రా పెవిలియన్‌కు చేర్చినప్పటికీ కెప్టెన్ దినేష్ చండీమల్ (35), చమర కపుగెదర (25) స్థిమితంగా ఆడి మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. వీరి నిష్క్రమణ తర్వాత దసన్ షనక (3) అశ్విన్ బౌలింగ్‌లో రైనాకు దొరికిపోయినప్పటికీ మిలిందా సిరివర్ధన (21), సీక్కుగె ప్రసన్న (3) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తిచేశారు. దీంతో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు రాబట్టిన శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు సాధించగా, సురేష్ రైనా ఒక వికెట్ రాబట్టాడు.

సత్తా చాటిన కసున్ రజిత (3/29)
ఆస్ట్రేలియా టి-20
సారథిగా స్మిత్