క్రీడాభూమి

మ్యాచ్‌లకు ముందే నిధుల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈసారి ఐపిఎల్ సందర్భంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే క్రికెట్ సంఘాలకు, ఆయా మ్యాచ్‌ల ఆరంభానికి ముందే బిసిసిఐ నుంచి వాటా లభించనుంది. ఒక్కో మ్యాచ్‌కి 60 లక్షల రూపాయలు చొప్పున సంబంధిత క్రికెట్ సంఘాలకు చెల్లిస్తున్నారు. ఇందులో 30 లక్షల రూపాయలను స్థానిక ఫ్రాంచైజీ మ్యాచ్‌కి ముందు, మిగతా 30 లక్షల రూపాయలను బిసిసిఐ మ్యాచ్ ముగిసిన తర్వాత చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే బిసిసిఐ వాటాను ఇప్పించాల్సిందిగా సిఒఎను కలిసిన ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హైదరాబాద్, సౌరాష్ట్ర, మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘాల ప్రతినిధులు కోరారు. ఇందుకు సిఒఎ సానుకూలంగా స్పందించింది. ఈ నిర్ణయం ప్రకారం, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు తలా 4.20 కోట్ల రూపాయలు బిసిసిఐ నుంచి పొందుతాయి. ఈ కేంద్రాలు ఏడేసి మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. అదే విధంగా కాన్పూర్‌లో రెండు మ్యాచ్లను నిర్వహించనున్న ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘం ఆయా మ్యాచ్‌లకు ముందే 1.20 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
సిఒఎ తరఫున వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ గురువారం నాటి సమావేశానికి హాజరయ్యారు. మిగతా ఇద్దరు సభ్యులు, రామచంద్ర గుహ, విక్రం లిమాయే రాలేకపోయారు.