క్రీడాభూమి

అందరినీ ఉద్దేశించి అనలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ఆస్ట్రేలియా క్రికెటర్లతో స్నేహ సంబంధాల విషయంలో తన ఆలోచన మారిందని, వారితో ఎలాంటి స్నేహం లేదని తాను చేసిన వ్యాఖ్యలపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లతో తాను భవిష్యత్తులో ఎన్నడూ స్నేహ సంబంధాలు పెట్టుకోనన్నది తన ఉద్దేశం కాదని ట్వీట్ చేశాడు. ఆ జట్టుతో టెస్టు సిరీస్ ఆరంభం కాకముందు తన అభిప్రాయం ఒక విధంగా ఉండేదని, సిరీస్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు తన ఆలోచనను మార్చేశాయని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో స్నేహ సంబంధాలకు తెరపడిందన్న తన వ్యాఖ్య ఆ దేశానికి చెందిన క్రికెటర్లందరికీ వర్తించదని తెలిపాడు. ఒకరిద్దరు ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకొని తాను ఆ వ్యాఖ్యలు చేశానని, అయితే, ఆస్ట్రేలియా క్రికెటర్లతో తాను ఇకపై ఎన్నటికీ స్నేహం కొనసాగించనన్న అర్థం స్పురిస్తున్నందన వివరణ ఇవ్వాల్సి వచ్చిందని వివరించాడు. ఆస్ట్రేలియా జట్టు మొత్తాన్ని తాను ఎన్నడూ విమర్శించలేదని తెలిపాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఉద్రిక్తతల మధ్య ముగిసిన విషయం తెలిసిందే. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ డిఆర్‌ఎస్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడడాన్ని కోహ్లీ తప్పుపట్టడంతో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆతర్వాత రెండు దేశాలకు చెందిన ప్రస్తుత, మాజీ క్రికెటర్లు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శల దాడిని కొనసాగించారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డు అధికారులు కూడా వివాదాల అగ్నికి ఆజ్యం పోశారు. ఆద్యంతం యుద్ధ వాతావరణంలో సిరీస్ ముగిసిం ది. కానీ, ఆ ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి.
ఐపిఎల్‌పై ప్రభావం?
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్, ఆస్ట్రేలి యా క్రికెటర్లు మైదానాన్ని యుద్ధ భూమిగా మార్చే సిన నేపథ్యంలో, ఐపిఎల్ టోర్నీపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనన్నది ఆసక్తి రేపుతున్నది. ఇరు జట్లలోని చాలా మంది క్రికెటర్లు పదో ఐపిఎల్ లో వివిధ ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగుతున్నా రు. ఇటీవలి టెస్టు సిరీస్‌లో చోటు చేసుకున్న సంఘ టనలను దృష్టిలో ఉంచుకొని, వారు ఐపిఎల్ వేదిక గా మరోసారి బాహాబాహికి దిగే ప్రమాదం లేకపో లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.