క్రీడాభూమి

ఎస్‌జిఎం నిర్వహణకు మా అనుమతి అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను ఎప్పుడైనా నిర్వహంచుకోవచ్చని, అందుకు తమ అనుమతి అనవసరమని పాలనాధికారల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. గురువారం ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ ఎస్‌జిఎంను ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో సిఒఎ జోక్యం చేసుకోదని అన్నాడు. అదే విధంగా ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు తమ ఆమోద ముద్ర అవసరం లేదని అన్నాడు. అయితే, నిర్ణయాలు ఏవైనా సుప్రీం కోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉంటే సిఒఎ తప్పక జోక్యం చేసుకుంటుందని తేల్చిచెప్పాడు. ఇంతకు ముందు నిర్ణయించిన విధంగానే ఎస్‌జిఎం వచ్చేనెల 9వ తేదీన జరుగుతుందా? అన్న ప్రశ్నకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ఐపిఎల్ పాలక మండలి సమావేశానికి రాజీవ్ శుక్లా అధ్యక్షత వహించాడని అన్నాడు. శుక్లా ఇప్పటికీ ఐపిఎల్ చైర్మన్‌గానే కొనసాగుతున్నాడని అంటూ, సుప్రీం కోర్టు అతనిపై అనర్హత వేటు వేయలేదని గుర్తుచేశాడు. పాలక మండలి కూడా రద్దుకాలేదని, కాబట్టి, శుక్లా చైర్మన్‌గానే ఉన్నాడని వివరించాడు. సమావేశం మధ్య నుంచి కొంత మంది అధికారులు అలిగి వెళ్లిపోయినట్టు వచ్చిన సమాచారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒక విలేఖరి కోరగా, వినోద్ రాయ్ అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశాడు. ఇదంతా మీడియా ఊహాగానమన్నాడు.
ముంబయికి ప్లే ఆఫ్ మ్యాచ్
ఈసారి ఐపిఎల్‌లో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్‌ని ముంబయికి కేటాయించాలని నిర్ణయించినట్టు వినోద్ రాయ్ తెలిపాడు. సిఒఎ, ఐపిఎల్ పాలక మండలి సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నాడు. ఐపిఎల్‌ను విజయవంతం చేయాలన్నదే అందరి లక్ష్యమని, ఈ దిశగానే చర్చ కొనసాగిందని వివరించాడు. నిరుడు కోర్టు తీర్పు కారణంగా ముంబయిలో జరగాల్సిన ప్లే ఆఫ్ మ్యాచ్‌ని మరో కేంద్రానికి మార్చాల్సి వచ్చిందని అన్నాడు. అందుకే, ఈసారి ఒక ప్లే ఆఫ్ మ్యాచ్‌ని ముంబయిలో నిర్వహించాలని తీర్మానించినట్టు అతను చెప్పాడు.
ఐపిఎల్ పాలక మండలి సమావేశానికి రాజీవ్ శుక్లాతోపాటు పివి శెట్టి, సౌరవ్ గంగూలీ, సికె ఖన్నా, అనిరుద్ధ్ చౌదరీ హాజరయ్యారు. అమిత్ చౌదరీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నాడు. పార్లమెంటు సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా సమావేశానికి రాలేదు. మరో సభ్యుడు పాండోవ్ వయసు 70 ఏళ్లు దాటడంతో అతను అనర్హతను ఎదుర్కొంటున్నాడు.

చిత్రం..వినోద్ రాయ్