క్రీడాభూమి

డివిలియర్స్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 1: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికా దేశవాళీ వనే్డ టోర్నీకి దూరం కావడంతో, ఐపిఎల్‌లో తమ పరిస్థితి ఏమిటని బెంగళూరు క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అతని స్థానంలో డివిలియర్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్టు బెంగళూరు ప్రకటించింది. అయితే, డివిలియర్స్ కూడా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మరో కొత్త కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టాలి. అంతేగాక, లోకేష్ రాహుల్ గాయంతో బాధపడుతున్నాడు. త్వరలోనే లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకోనున్న అతను ఈసారి ఐపిఎల్‌లో ఆడడం లేదు. కోహ్లీ, రాహుల్‌తోపాటు ఇప్పుడు డివిలియర్స్ సేవలు కూడా అనుమానాస్పదంగా మారడంతో, బెంగళూరు బ్యాటింగ్ బలహీన పడడం ఖాయం. ఈ సమస్య నుంచి ఆ జట్టు ఏ విధంగా గట్టెక్కుతుందో చూడాలి.

చిత్రం..డివిలియర్స్