క్రీడాభూమి

రక్తికట్టిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ రక్తికట్టింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి ప్రేక్షకులను అలరించాయి. ఆటతోపాటు, మైదానంలో చోటు చేసుకున్న ఘర్షణలు, వాగ్వాదాలు, వెక్కిరింతలు కూడా టీమిండియా క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కించాయి. ఎవరైనా హ్లెడ్జింగ్‌కు పాల్పడితే గతంలో మాదిరి ఊరుకునే ప్రసక్తే లేదని, మాటకుమాట జవాబు చెప్పితీరుమతామని టీమిండియా ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా హెచ్చరికలు పంపారు. మొత్తం మీద మైదానం లోపల, బయట కూడా ఈ సిరీస్ ఎంతో ఉత్కంఠను సృష్టించింది. ప్రతిభాపాటవాల్లో సమవుజ్జీలుగా ఉన్న రెండు జట్లు ఢీ కొంటే, ప్రతి మ్యాచ్ ఎంత ఉత్కంఠ రేపుతుందో చెప్పడానికి తాజా సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లే నిదర్శనం. సిరీస్ మొత్తంలో రెండు జట్లు ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా ఆడారు. వికెట్‌కు ఇచ్చిన పరుగుల విషయంలో వ్యత్యాసం కేవలం 1.49 పరుగులంటే, పోటీ ఏ విధంగా కొనసాగిందో ఊహించుకోవచ్చు. భారత్ ఒక్కోవికెట్‌కు సగటున 28.13 పరుగులిస్తే, ఆస్ట్రేలియా 26.64 పరుగులిచ్చింది. రెండు జట్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో, బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించడం చాలా కష్టమైంది. సిరీస్‌లో ఇరు జట్ల పరుగుల వ్యత్యాసం 2.9 కంటే తక్కువగా ఉంది. మిగతా జట్లతో జరిగిన సిరీస్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రన్‌రేట్‌లో తేడా భారత్, ఇంగ్లాండ్ మధ్య 17.35, భారత్-న్యూజిలాండ్ మధ్య 25.09, భారత్, బంగ్లాదేశ్ మధ్య 52.7 శాతంగా నమోదైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తేడా కనీసం మూడు శాతం కూడా లేదు. ఈ సిరీస్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
ఏడో వికెట్ భాగస్వామ్యం
ఈ సిరీస్‌లో, ప్రత్యేకించి చివరి రెండు టెస్టుల్లో ఏడో వికెట్ భాగస్వామ్యం చాలా కీలక పాత్ర పోషించింది. భారత జట్టు ఈ వికెట్‌కు సగటున 50.66 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, ఆస్ట్రేలియాకు 23.57 పరుగులు మాత్రమే దక్కాయి. రాంచీలో ఇదే వికెట్‌కు వృద్ధిమాన్ సాహా, చటేశ్వర్ పుజారా 199 పరుగులు జోడించారు. అదే విధంగా ధర్మశాలలో వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా 96 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అందించారు. రెండు సందర్భాల్లోనూ భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిపెట్టారు. ఈ ఏడో వికెట్ భాగస్వామ్యం కారణంగానే రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఒకటి నుంచి ఆరు వికెట్ల వరకూ భారత్ సగటు 33.18 పరుగులైతే, ఆస్ట్రేలియా సగటు 33.62 పరుగులు. దీనిని బట్టి, ఆరు వికెట్ల వరకూ ఇరు జట్లు ఏ విధంగా పోటీపోటీగా నడిచాయో, ఏడో వికెట్ పార్ట్‌నర్‌షిప్ ఏ విధంగా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందో ఊహించుకోవచ్చు.
వార్నర్ విఫలం
హార్డ్ హిట్టర్‌గా పేరు పొందిన డేవిడ్ వార్నర్ ఈ సిరీస్‌లో అభిమానులను నిరాశపరిచాడు. అతను భారత బౌలింగ్‌ను, ప్రత్యేకించి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన అతను, స్పిన్ బౌలింగ్‌లోనే ఆరు పర్యాయాలు అవుటయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో అతను సగటున 40 పరుగులు సాధిస్తే, స్పిన్నర్లపై అతని సగటు 20 పరుగులు మాత్రమే. వార్నర్ ఈసిరీస్‌లో అశ్విన్ చేతిలో మూడు, జడేజా చేతిలో రెండు పర్యాయాలు పెవిలియన్ దారిపట్టాడు.
పేస్‌తో రెన్‌షా తడబాటు!
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సహజంగా స్పిన్ అంటే భయపడతారు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరిస్తాయి కాబట్టి, వారికి పేసర్లంటే భయం ఉండదు. కానీ, ఆసీస్ యువ ఓపెనర్ మాట్ రెన్‌షా ఇందుకు భిన్నంగా, భారత పర్యటనలో ఫాస్ట్ బౌలర్లతోనే ఇబ్బంది పడ్డాడు. ఉమేష్ యాదవ్ సగటున 16 పరుగులిచ్చి మూడు పర్యాయాలు అతనిని అవుట్ చేశాడు. ఇశాంత్ శర్మ 15 సగటుతో రెండుసార్లు రెన్‌షా వికెట్ సాధించాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో తడబడిన రెన్‌షా స్పిన్నర్లను మాత్రం సమర్థంగానే ఎదుర్కొన్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో 75, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 57 చొప్పున పరుగులు సాధించాడు.
మొత్తం మీద ఈ సిరీస్ గతంలో ఎన్నడూ లేని విధం గా ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయ. కాగా, అసాధారణ ఫామ్‌ను కొనసాగిం చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో విఫలంకా గా, అందుకు భిన్నంగా ఆస్ట్రేలియా కెప్టెన్ అద్భుతంగా రా ణించి మూడు శతకాలతో సత్తా చాటడం ఎవరూ ఊహిం చని పరిణామంగా చెప్పుకోవాలి.