క్రీడాభూమి

కివీస్‌కు వర్షం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 29: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టులో విజయానికి చేరువైనప్పటికీ, వర్షం కారణంగా న్యూజిలాండ్ డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆట వర్షం కారణంగా రద్దుకావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఓటమి నుంచి బయపడిన ఆ జట్టు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 314 పరుగులు చేసింది. అందుకు సమాధానంగా న్యూజిలాండ్ 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీనితో చివరిరోజు ఆట కొనసాగితే, ఈ జట్టు ఓటమి ఖాయంగా కనిపించింది. కానీ, ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని ఈ జట్టును అదృష్టం వర్షం రూపంలో వరించింది. చివరి రోజు ఆట కొనసాగకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. సిరీస్‌ను దక్షిణాఫ్రికా దక్కించుకుంది.

చిత్రం..టెస్టు సిరీస్ ట్రోఫీతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ప్లెసిస్