క్రీడాభూమి

‘శాగ్’లో పసిడి పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: ఇక్కడ జరుగుతున్న దక్షిణాసియా క్రీడోత్సవాల్లో(శాగ్) వరసగా నాలుగో రోజు కూడా భారత్ క్రీడాకారులు బంగారు పంట పండించారు. మంగళవారం స్విమ్మింగ్, ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో ప్రకటించిన బంగారు పతకాల్లో దాదాపుగా అన్ని పతకాలను భారత క్రీడాకారులే దక్కించుకొని పతకాల పట్టికలో తిరుగులేని ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో భారత్‌కు లభించిన మొత్తం పతకాల సంఖ్య 119కి చేరుకుంది. వీటిలో 74 స్వర్ణ పతకాలు కాగా, 35 వెండి, 10 కాంస్య పతకాలున్నాయి. కాగా, 17 బంగారు, 36 వెండి, 31 కాంస్య పతకాలు, మొత్తం 84 పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. మంగళవారం భారతీయ స్విమ్మర్లు అద్భుత ప్రదర్శనతో ఏడు బంగారు పతకాలను దక్కించుకోగా, ట్రాక్ అండ్ ఫీల్డ్, ఆర్చరీ విభాగాల్లోను భారతీయులకు ఎదురు లేక పోయింది. ఆర్చరీలో భారతీయ క్రీడాకారులు మొత్తం 5 బంగారు పతకాలనూ తమ ఖాతాలో వేసుకోగా, అథ్లెట్లు సైతం 5 బంగారు పతకాలు, మరో ఆరు వెండి, మూడు కాంస్య పతకాలను దక్కించుకున్నారు. గత మూడు రోజులుగా శ్రీలంక స్విమ్మర్లు భారత క్రీడాకారులకు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. అయితే ఈ పోటీల చివరి రోజయిన మంగళవారం మాత్రం మన వాళ్లకు ఎదురే లేకుండా పోయింది.
స్విమ్మింగ్: పురుషుల 400మీటర్ల ఫ్రీస్టైల్‌లో 3 నిమిషాల 58.84 సెకన్ల సరికొత్త గేమ్స్ రికార్డుతో సౌరబ్ సంగ్వేకర్ బంగారు పతకాలకు బోణీ కొట్టారు. మహిళల 400 మీటర్ల ప్రీస్టైల్‌లో 4 నిమిషాల 30.08 సెకన్ల సరికొత్త రికార్డుతో వి మాళవిక బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో 2 నిమిషాల 03.02 సెకన్ల సరికొత్త రికార్డుతో సజన్ ప్రకాశ్ మన దేశానికి మూడో స్వర్ణ పతకం సాధించాడు. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో దామినీ గౌడ 2నిమిఃల 21.12 సెకన్ల సరికొత్త రికార్డుతో మరో బంగారు పతకం సాధించింది. 200మీటర్ల ఫ్రీస్టైల్ పురుషులు, మహిళల విభాగాలు రెండింటిలోను భారత క్రీకారులు బంగారు పతకాలను దక్కించుకున్నారు. కాగా, మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీలంకకు చెందిన కిమికో రహీమ్ సరికొత్త రికార్డుతో బంగారు పతకాన్ని సాధించింది. భారత్‌కు ఈ రోజు రజత పతకాలు సాధించి పెట్టిన వారిలో సాజన్ ప్రకాశ్( పురుషుల 400 మీ.ఫ్రీస్టైల్), శివానీ కటారియా(మహిళల 400 మీ.ఫ్రీస్టైల్), ఏం అరవింద్ (పురుషుల బ్యాక్‌స్ట్రోక్), మానసా పటేల్ (మసిళల 50 మీ.బ్యాక్‌స్ట్రోక్) ఉన్నారు.
ఆర్చరీ: అంతకు ముందు షిల్లాంగ్‌లో భారతీయ ఆర్చర్లుఈ రోజు లభించిన అయిదు బంగారు పతకాలను దక్కించుకున్నారు. దీంతో ఈ విభాగంలో భారత ఆర్చర్లు మొత్తం పది బంగారు, నాలుగు రజత పతకాలు సాధించినట్లయింది. భారత మహిళల దీపికా కుమారి, లక్ష్మీరాణి మఝి, బొంబయాలా దేవిలు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినప్పటికీ శ్రీలంక ప్రత్యర్థులను 6-0 తేడాతో ఓడించి తొలి స్వర్ణం సాధించారు. ఆ తర్వాత పురుషుల విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, గరుచరణ్ ఫెస్రా, జయంత తాలూక్దార్‌లు సైతం ఫైనల్లో తమ శ్రీలంక ప్రత్యర్థులపై 5-1 తేడాతో విజయం సాధించారు. భారత మిక్స్‌డ్ జంట రాయ్, దీపికలు బంగ్లాదేశ్ జంట సోజేబ్ షేక్, బ్యూటీ రాయ్‌లపై 6-0 తేడాతో సునాయాస విజయం సాధించారు. మధ్యాహ్నం సెషన్స్‌లో రికర్వ్ ఆర్చర్లు మరో రెండు స్వర్ణాలు, మరో రెండు రజతాలను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ విభాగంలో ఉన్న మొత్తం పది బంగారు పతకాలతో పాటు నాలుగు రజత పతకాలను కూడా భారత ఆర్చర్లు దక్కించుకున్నట్లయింది.
ట్రాక్ అండ్ ఫీల్డ్: ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత అథ్లెట్ల విజయపరంపర కొనసాగింది. ఈ విభాగంలో భారత అథ్లెట్లు అయిదు స్వర్ణ, ఆరు రజత, మూడు కాంస్య పతకాలను దక్కించుకోగా, గట్టిపోటీ ఇచ్చిన శ్రీలంక నాలుగు బంగారు, ఒక రజత, అయిదు కాంస్య పతకాలు దక్కించుకుంది. రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన మన్‌ప్రీత్ కౌర్ మహిళల షాట్‌పుట్‌లో తొలి స్వర్ణ పతకం సాధించింది. అదే పేరు కలిగిన మన్‌ప్రీత్ జూనియర్ అదే విభాగంలో రజత పతకం దక్కించుకుంది. డబ్ల్యు ఫెర్నాండోకు కాంస్య పతకం దక్కింది. పురుషుల హ్యామర్‌త్రోలో నీరజ్ కుమార్ రెండో బంగారు పతకం సాధించగా పాకిస్తాన్‌కు చెందిన షకీల్ అహ్మద్, శ్రీలంకకు చెందిన ఎల్ అలన్సాన్‌లు రజత, కాంస్య పతకాలు సాదించారు. మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ బంగారు పతకం సాధించగా, జి శారద రజత పతకం సాధించింది. కాగా, పురుషుల, మహిళల 500- మీటర్ల రేస్‌లలో భారతీయులకే తొలి రెండు స్థానాలు దక్కాయి. పురుషుల విభాగంలో మాన్ సింగ్, సురేశ్ కుమార్‌లు తొలి రెండు స్థానాల్లో నిలవగా, మహిళల విభాగంలో ఎల్ సూర్య, స్వాతి గధవేలు బంగారు, వెండి పతకాలు సాధించారు. అయితే పురుషుల, మహిళల వినాగాలు రెండింటిలోను శ్రీలంక స్వర్ణ పతకాలు ఎగరేసుకు పోగా, భారత్‌కు రజత పతకాలు దక్కాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో చివరి రజో భారత లిఫ్టర్లు మరో స్వర్ణం, రజత పతకం సాధించారు. కాగా, చివరి రోజు పోటీల్లో సైక్లిస్టులు మన దఏవానికి ఒక బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలను సాధించి పెట్టారు. ఇదిలా ఉండగా, మహిళల ఫుట్‌బాల్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 5-0 గోల్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.

మహిళల 4న200 మీటర్ల ఫ్రీస్టయల్‌లో
పసిడి పతకం సాధించిన భారత స్విమ్మర్లు

పురుషుల 4న200 మీటర్ల ఫ్రీస్టయల్‌లో పసిడి పతకం సాధించిన భారత స్విమ్మర్లు