క్రీడాభూమి

నాడు జేజేలు.. నీటిమూటలైన హామీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఎనిమిదేళ్ల క్రితం షాంఘై (చైనా)లో జరిగిన ప్రత్యేక ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు విశేష ప్రశంసలు తీసుకురావడంతో పాటు ‘స్పెషల్ అథ్లెట్’గా ఖ్యాతి పొందిన హమీద్ ప్రస్తుతం కూలిపని చేస్తూ అత్యంత దైన్య స్థితిలో జీవన పోరాటాన్ని సాగిస్తున్నాడు. 2007లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ 400 మీటర్ల రిలే పరుగులో హమీద్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటుకోవడంతో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తన అధికార నివాసంలో ఆయనకు తేనీటి విందు ఇవ్వడంతో పాటు ఉద్యోగాన్ని కల్పించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎనిమిదేళ్లు గడచినా ఈ హామీలు నెరవేరకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక హమీద్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. హమీద్ తండ్రి చనిపోవడంతో కూలీ నాలీ చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చానని, అయితే వృద్ధాప్యం మీద పడి తన సత్తువ సన్నగిల్లడంతో గత్యంతరం లేక హమీద్ కూడా కూలి పనిలోకి దింపాల్సి వచ్చిందని అతని తల్లి హదికునిసా పిటిఐ వార్తా సంస్థకు గోడు వెళ్లబోసుకుంది.
కాగా, షాంఘైలో హమీద్ ఒక్కడే భారత్‌కు ఐదు వేర్వేరు విభాగాల్లో ప్రాతినిథ్యం వహించాడని అతనితో పాటు స్పెషల్ ఒలింపిక్స్‌కు వెళ్లిన కోచ్ ఇజాజ్ తెలిపాడు. పసి వయసులో ఉన్నప్పుడు హమీద్‌ను అతని తల్లి మానసిక దౌర్భలురకు సేవలు అందించే ఎన్‌జిఓకు తీసుకురావడంతో అతను తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడం ప్రారంభించాడని, దీంతో 2003 నుంచి హమీద్‌కు శిక్షణ ఇచ్చానని ఇజాజ్ వివరించాడు. ప్రస్తుతం హమీద్ (30) అత్యంత దైన్య స్థితిలో జీవనం సాగించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన తెలిపాడు. దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన తన శిష్యుడికి చిన్నపాటి ఎవరైనా సాయం చేయగలిగితే అతను మళ్లీ అద్భుతాలు సృష్టిస్తాడని, శాశ్వతంగా ఆదాయం వచ్చేలా చూడగలిగితే అతని జీవితం మళ్లీ సరైన దారిలో పడుతుందని ఇజాజ్ స్పష్టం చేశాడు.

విజార్డ్స్ చేతిలో వారియర్స్ చిత్తు

లక్నో: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ లక్నోలోని తమ సొంత మైదానంలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 4-1 గోల్స్ తేడాతో పంజాబ్ వారియర్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తమ ఖాతాలో మొత్తం 23 పాయింట్లను జమ చేసుకుని లీగ్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకోవడంతో పాటు సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ ఆరంభంలో పంజాబ్ జట్టు కొద్దిసేపు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 10వ నిమిషంలో లభించన పెనాల్టీ కార్నర్‌ను మార్క్ గ్లెగ్‌హార్న్ గోల్‌గా మలచి ఆ జట్టుకు 1-0 ఆధిక్యతను అందించాడు. దీంతో రెండో క్వార్టర్‌లో విజృంభించి ఆడిన ఉత్తరప్రదేశ్‌కు అర్జెంటీనా ఆటగాడు గోంజాలో పిల్లట్ 19వ నిమిషంలో ఈక్వలైజర్‌ను సాధించి పెట్టడంతో పాటు మూడో క్వార్టర్ రెండో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్‌గా మలచి 2-1 ఆధిక్యతను అందించాడు. ఆ తర్వాత పంజాబ్ శిబిరంపై పదేపదే దాడులకు దిగిన ఉత్తరప్రదేశ్‌కు 43వ నిమిషంలో అగస్టీన్ మజిల్లీ అద్భుతమైన ఫీల్డ్‌గోల్ సాధించి పెట్టడంతో ఆ జట్టు 4-1 తేడాతో విజయం సాధించింది.

జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో
పలు పతకాలు సాధించి కూలీగా జీవిస్తున్న హమీద్