క్రీడాభూమి

పెనాల్టీలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ వాంగోవర్, ఏప్రిల్ 7: పెనాల్టీ కార్నర్లపై దృష్టి కేంద్రీకరించామని, ఈ విభాగంలో రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి చెప్పింది. ఇక్కడ జరుగుతున్న మహిళల హాకీ ప్రపంచ లీగ్ రెండో రౌండ్ పోటీల్లో ఆడుతున్న భారత్ సెమీ ఫైనల్ చేరింది. ఆదివారం బెలారస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పెనాల్టీలు కీలకంగా మారుతాయని రాణి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. లీగ్ స్థాయిలో బెలారస్‌ను ఢీకొన్నప్పుడు పెనాల్టీలను అనుకున్న స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయామని రాణి తెలిపింది. సెమీ ఫైనల్‌లో అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని పేర్కొంది. లీగ్ దశలో ఉరుగ్వేను పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఓడించిన భారత్ ఆతర్వాత బెలారస్‌పై 1-0 ఆధిక్యంతో గెలిచింది.