క్రీడాభూమి

దుమ్మురేపిన డీకాక్, ఆమ్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో వరుస ఓటములను ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా జట్టు మూడో వనే్డ (డే/నైట్) మ్యాచ్‌లో సత్తా చాటుకుంది. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో బుధవారం తెల్లవారు జాము వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటోన్ డీకాక్, హషీమ్ ఆమ్లా చెరో శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో చక్కటి శుభారంభాన్ని అందించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఈ సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జాసన్ రాయ్ (20) స్వల్ప స్కోరుకే నిష్క్రమించినప్పటికీ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ జో రూట్ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన రూట్ చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అలెక్స్ హాలెస్ (65)తో కలసి రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. హాలెస్ వెనుదిరిగిన తర్వాత వికెట్ కీపర్ జోస్ బట్లర్ (0), ఇయాన్ మోర్గాన్ (8) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ ఫోర్త్‌డౌన్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్‌తో కలసి ఐదో వికెట్‌కు మరో 82 పరుగులు జోడించిన రూట్ 113 బంతుల్లో ఐదు సిక్సర్లు, మరో పది ఫోర్ల సహాయంతో 125 పరుగుల కెరీర్ బెస్టు స్కోరు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మొరుూన్ అలీ (3), బెన్ స్టోక్స్ (53), క్రిస్ జోర్డాన్ (3) త్వరత్వరగా నిష్క్రమించగా, డేవిడ్ విల్లీ (13), ఆదిల్ రషీద్ (13) అజేయంగా నిలిచారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం భారీ లక్ష్యంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు క్వింటోన్ డీకాక్, హషీమ్ ఆమ్లా ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన వీరు అద్భుతమైన షాట్లతో విరుచుకుపడుతూ చెరొక శతకంతో దుమ్ము రేపడంతో పాటు 239 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. 117 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మరో 16 ఫోర్ల సహాయంతో 135 పరుగులు సాధించిన డీకాక్ 37వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ వేసిన బంతిని ఎదుర్కోబోయి మిడ్ ఆఫ్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డేవిడ్ వైజ్ (7) మొరుూన్ అలీ బౌలింగ్‌లో స్వల్ప స్కోరుకే నిష్క్రమించగా, కొద్ది సేపటికి హషీమ్ ఆమ్లా (130 బంతుల్లో రెండు సిక్సర్లు, 13 ఫోర్లు సహా 127 పరుగులు) క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక జోస్ బట్లర్‌కు దొరికిపోయాడు. అయితే ఫఫ్ డుప్లెసిస్ (33), కెప్టెన్ ఎబి.డివిలియర్స్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 46.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా జట్టు మరో 22 బంతులు మిగిలి ఉండాగానే 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన క్వింటోన్ డీకాక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో మిగిలిన రెండు వనే్డలు జొహానె్నస్‌బర్గ్, కేప్‌టౌన్‌లలో జరుగుతాయి.
chitram...
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్వింటోన్ డీకాక్ (117 బంతుల్లో 135 పరుగులు)