క్రీడాభూమి

టైటిల్‌పై సింధు, సైనా గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 10: భారత బాడ్మింటన్ స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్‌లో టైటిల్‌పై కనే్నశారు. ముందుగా క్వాలిఫయర్స్, ఆతర్వాత మెయిన్ డ్రా పోటీలు జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సింధు హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. ఇటీవలే మలేసియా ఓపెన్‌లో చైనాకు చెందిన యువ క్రీడాకారిణి చెన్ యుఫెయ్ చేతిలో ఓడిన సింధు ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేని విధంగా, అన్ని విధాలా సిద్ధమైంది. కాగా, మలేసియా టోర్నీ మొదటి రౌండ్‌లోనే జపాన్ క్రీడాకారిణిని అకానే యమాగూచితో తలపడి ఓడిన సైనా కూడా విజయంపై నమ్మకంతో ఉంది. వీరిద్దరూ టైటిల్ వేటలో ఎంత వరకూ సఫలమవుతారన్నది చూడాలి.

చిత్రాలు..పివి సింధు, సైనా నెహ్వాల్