క్రీడాభూమి

గేల్ అభిమానుల నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లేకపోవడం అతని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. టి-20 ఫార్మాట్‌లో 10,000 పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్‌గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించేందుకు మరో 25 పరుగుల దూరంలో ఉన్న గేల్, ఆ ఫీట్‌ను సాధిస్తాడని ఎంతో ఆశతో వచ్చిన అభిమానులకు ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతను లేడన్న వార్త శరాఘాతమైంది. గేల్ ఇప్పటి వరకూ 9,975 పరుగులు చేశాడు. దీనితో అతను పదివేల పరుగులను పూర్తి చేసి, కొత్త రికార్డు సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చని అభిమానులు ఆశించినా ఫలితం లేకపోయింది. అంతేగాక, ఐపిఎల్‌లో పలు రికార్డులను సొంతం చేసుకున్న గేల్ విజృంభిస్తే చూడాలనుకున్న ప్రేక్షకులు నీరుగారిపోయారు. గేల్ 3,458 పరుగులతో, ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మొదటి నాలుగు స్థానాల్లో వరుసగా సురేష్ రైనా (4,166), విరాట్ కోహ్లీ (4,110), రోహిత్ శర్మ (3,877), గౌతం గంభీర్ (3,710) ఉన్నారు. ఐపిఎల్‌లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా అతని పేరుమీదే ఉంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు వరకూ అతను 92 ఇన్నింగ్స్ ఆడి 254 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 139 ఇన్నింగ్స్‌లో 163 సిక్సర్లు కొట్టాడు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న వ్యత్యాసమే గేల్ సామర్థ్యానికి నిదర్శనం. ఐపిఎల్‌లో అత్యధిక స్కోరు (175 నాటౌట్), వేగవంతమైన సెంచరీ (30 బంతులు), ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17) రికార్డులు కూడా గేల్ ఖాతాలోనే ఉన్నాయి. అయితే, ఈసారి ఐపిఎల్‌లో అతను అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం అభిమానులను నిరాశ పరుస్తున్నది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతను 32, 6 చొప్పున పరుగులు చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి చోటు దక్కలేదు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఎబి డివిలియర్స్ టాప్ స్కోరర్‌గా నిలవడం క్రికెట్ అభిమానులకు ఊరటనిచ్చింది.