క్రీడాభూమి

మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 విజేత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ వాంగోవర్, ఏప్రిల్ 10: మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 ఫైనల్‌లో చిలీని పెనాల్టీ షూటౌట్‌లో ఓడించిన భారత జట్టు వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్‌కు అర్హత సంపాదించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో భారత్‌క, చిలీ తీవ్ర స్థాయిలో పోటీనిచ్చింది. ఇరు జట్లు ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకుంటూ, గోల్స్ కోసం దాడులకు దిగుతూ పోరాటం సాగించాయి. మ్యాచ్ నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరొక గోల్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీనితో ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. చిలీ తరఫున జొసెఫా విలాలాబెటియా, కిమ్ జాకబ్ చేసిన ప్రయత్నాలను భారత గోల్‌కీపర్ సవిత అడ్డుకుంది. మరోవైపు భారత్ తరఫున కెప్టెన్ రాణి, మోనికా తమతమ ప్రయత్నాల్లో సఫలమయ్యారు. దీనితో చిలీపై 2-0 తేడాతో భారత్ విజేతగా నిలిచింది. అంతకు ముందు మ్యాచ్‌లో చిలీ తరఫున కరోలినా గార్సియా, భారత్ తరఫున దీపిక గోల్స్ సాధించారు.

చిత్రం.. మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో విజేతగా నిలిచి వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్‌కు అర్హత సంపాదించిన భారత జట్టు