క్రీడాభూమి

ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ ‘టాప్-10’లో సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’ జాబితాలోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం, 58 కిలోల విభాగంలో సాక్షి ఐదో స్థానంలో ఉంది. కాగా, పురుషుల విభాగంలో సందీప్ తోమర్ కూడా ‘టాప్-10’లోకి చేరాడు. 57 కిలోల విభాగంలో అతను ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. మహిళల విభాగంలో కవోరీ ఇచో (జపాన్), పురుషుల విభాగంలో వ్లాదిమిర్ కించెగష్విలి (జార్జియా) నంబర్ వన్ స్థానాలను ఆక్రమించారు.

చిత్రం..సాక్షి మాలిక్