క్రీడాభూమి

క్రిస్ లిన్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్ భుజానికి గాయమైంది. దీనితో అతను ఐపిఎల్‌లో కొనసాగడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జొస్ బట్లర్ క్యాచ్‌ని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు లిన్ కిందపడ్డాడు. గత రెండేళ్ల కాలంలో రెండు పర్యాయాలు బలమైన గాయాలు తగిలిన భుజానికే మరోసారి గాయంకావడంతో, కొంతకాలం అతను క్రికెట్‌కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ‘నేను చేసిన పొరపాటు ఏమిటి?’ అంటూ లిన్ ట్వీట్ చేయడంద్వారా పరోక్షంగా ఐపిఎల్‌లో పాల్గొనలేనేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఈసారి ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్‌ను నైట్ రైడర్స్ ఢీకొన్నప్పుడు లిన్ అజేయంగా 93 పరుగులు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో వేగంగా 32 పరుగులు చేశాడు. ఇలావుంటే, లిన్ గాయం తీవ్రత గురించి సమాచారం తెలుసుకుంటున్నామని బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్)లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న క్వీన్స్‌లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈఏడాది జనవరి 13న బ్రిస్బేన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వనే్డతో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన లిన్ 13 పరుగులు చేశాడు. ఆ వెంటనే ఐపిఎల్ కోసం భారత్ వచ్చాడు. ఒకే భుజానికి వరుసగా మూడుసార్లు దెబ్బతగలడంతో అతని కెరీర్ ప్రమాదంలో పడిందని నిపుణులు అనుమానిస్తున్నారు.