క్రీడాభూమి

కోహ్లీ.. వచ్చేస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భుజానికి తగిలిన గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టోర్నమెంట్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో పోరుకు బరిలో దిగనున్నట్లు సూచనప్రాయంగా తెలిపాడు. కోహ్లీ తన జిమ్ సెషన్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసి ఈ మేరకు సంకేతాలిచ్చాడు. జిమ్‌లో కోహ్లీ క్లీన్ అండ్ జెర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. నిర్విరామంగా బరువులు ఎత్తుతూ కోహ్లీ ఈ వీడియోలో కనిపించడాన్ని చూస్తుంటే భుజం నొప్పి నుంచి అతను పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే శుక్రవారం బరిలోకి దిగుతానని అతను స్పష్టంగా ధ్రువీకరించలేదు. ‘ఇక ఆగలేను, మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఏప్రిల్ 14వ తేదీనే బరిలోకి దిగుతానేమో? అని కోహ్లీ తన పోస్టులో క్వశ్చన్ మార్కును పెట్టాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి గాయమైంది. దీంతో అతను ధర్మశాలలో జరిగిన నాలుగవ (చివరి) టెస్టు మ్యాచ్‌కు దూరం కావలసి వచ్చిన విషయం తెలిసిందే.