క్రీడాభూమి

ఐపిఎల్‌కు లిన్ దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 11: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అభిమానులకో చేదువార్త. గత ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ లిన్ ఐపిఎల్‌లో ఆడే అవకాశం లేదని అంటున్నారు. ఫీల్డింగ్ సందర్భంగా లిన్ ఎడంచేతి పాతగాయం మళ్లీ తిరగబెట్టిందని కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక ప్రకటనలో పేర్కొంటూ, జట్టు వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌పై ఒక నిర్ణయానికి రావడానికి కొన్ని రోజులు పడుతుందని, దాన్ని బట్టే మిగతా టోర్నమెంట్‌కు అతను అందుబాటులో ఉంటాడో లేదో తేలుతుందని ఆ ప్రకటన పేర్కొంది. లిన్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారని,ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ప్రకటన తెలిపింది. కాగా ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఉమేశ్ యాదవ్ తిరిగి జట్టులో చేరనుండడంతో ఆ జట్టుబౌలింగ్ విభాగం మరింత బలపడబోతోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. తాను తిరిగి త్వరలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో చేరబోతున్నట్లు ఉమేశ్ యాదవే స్వయంగా ట్వీట్ చేశాడు. లిన్ పూర్తిగా ఐపిఎల్‌నుంచే వైదొలగాల్సి ఉంటుందంటూ నిన్నటినుంచి కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ చేరిక ఆ జట్టుకు ఊరటనిచ్చేదే అవుతుంది.