క్రీడాభూమి

అర్జెంటీనా ఫుట్‌బాల్ కోచ్ బవుజాకి ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, ఏప్రిల్ 11: అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం (ఎఎఫ్‌ఎ) తమ జాతీయ జట్టు కోచ్ ఎడ్వర్డో బవుజాకు ఉద్వాసన పలికింది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించేందుకు అర్జెంటీనా జట్టు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. అర్జెంటీనా జట్టులో మూడేళ్ల నుంచి కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులకు తెర దించే బాధ్యతలను గత నెలలో కొత్త ఎగ్జిక్యూటివ్‌లకు అప్పగించిన ఎఎఫ్‌ఎ ఆ తర్వాత తీసుకున్న పెద్ద నిర్ణయం ఇదే. అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘ ప్రధాన కార్యాలయంలో బవుజాతో సమావేశమైన అనంతరం ఎఎఫ్‌ఎ కొత్త అధ్యక్షుడు క్లాడియో టపియా విలేఖర్లతో మాట్లాడుతూ, ‘ఇకమీదట జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆయనకు చెప్పా’ అని స్పష్టం చేశారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న అర్జెంటీనా జట్టు ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత మేటి జట్లలో ఒకటిగా పేరు పొందిన అర్జెంటీనాకు ఇటువంటి ముప్పు ఏర్పడటం 1970వ సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి.

చిత్రం..ఎడ్వర్డో బవుజా