క్రీడాభూమి

అయిదో రోజూ .. అదే దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దక్షిణాసియా క్రీడోత్సవాలు(శాగ్)లో బుధవారం అయిదో రోజు కూడా భారత్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. షూటర్లు, ఉషు క్రీడాకారులు, అథ్లెట్లు ఎదురులేని రీతిలో బంగారు పతకాలలో అత్యధిక భాగం దక్కించుకున్నారు. దీంతో 117 బంగారు, 61 రజతం, 16 కాంస్యం- మొత్తం 194 పతకాలతో భారత్ తిరుగులేని తీరులో అగ్రస్థానంలో నిలిచింది. 133 పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలిచినప్పటికీ అది సాధించింది 24 స్వర్ణ పతకాలే కావడం గమనార్హం. ఊహించినట్లుగానే అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు బంగారు పంట పండింది. ఈ ఒక్క రోజే ఏడు బంగారు పతకాలు ఈ విభాగంలో లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, పురుషుల 400 మీ. పరుగులో ఆరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, పురుషుల వంద మీటర్ల హర్డిల్స్‌లో జె సురేందర్, మహిళల వంద మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి, పురుషుల లాంగ్ జంప్‌లో అంకిత్ శర్మ, మహిళల హైజంప్‌లో సహానా కుమారిలు స్వర్ణ పతకాలు సాధించారు.
అంతకు ముందు స్విమ్మింగ్ పోటీల చివరి రోజు భారత స్విమ్మర్లు ఈ విభాగంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో వీరధవళ్ ఖడే తన తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 200 మీ. మెడ్లీలో శ్రద్ధా సుధీర్, మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లైలో జ్యోత్స్నా పనసారె, పురుషుల, మహిళల 400 మీటర్ల మెడ్లీ రిలే టీమ్‌లు కూడా బంగారు పతకాలను సాధించారు. స్విమ్మింగ్ ఈవెంట్ చివరి రోజున భారత్ మొత్తం 5 బంగారు, మూడు వెండి, ఒక కాంస్య పతకాలు సాధించింది. స్విమ్మింగ్‌లో భారత్‌కు రజత పతకాలు సాధించిన వారిలో సాను దేబ్‌నాథ్ (పురుషుల 200 మెడ్లీ), అంశుల్ కొఠారి (పురుషుల 50 మీ.బటర్‌ఫ్లై) అవంతికా చవాన్ (మహిళల 50మీ. బటర్‌ఫ్లై) ఉండగా, మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో శివానీ కటారియాకు కాంస్యం దక్కింది.
ఉషులో 8 స్వర్ణాలు
కాగా, షిల్లాంగ్‌లో ఉషు పోటీల చివరి రోజున భారత్ 8 బంగారు, ఒక రజత, రెండు కాంస్య పతకాలను సాధించింది. ఇప్పటికే ఈ విభాగంలో మూడు బంగారు, ఒక వెండి, మరో కాంస్య పతకం సాధించిన భారత్ మొత్తం 11 బంగారు, రెండు వెండి, మూడు కాంస్య పతకాలు సాధించినట్లయింది.
రాణించిన అపూర్వి చండేలా
గౌహతిలోని షూటింగ్ రేంజిలో సైతం భారత్ ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. రియో ఒలింపిక్స్‌కు ఎంపికయిన అపూర్వి చండేలా తన పెట్ ఈవెంట్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మొత్తం 209.00 పాయింట్లతో బంగారు పతకాన్ని సునాయాసంగా సాధించింది. ఈ ఈవెంట్‌లో మిగతా రెండు పతకాలు కూడా భారత్‌కే దక్కాయి. ఎలిజబెత్ సుశాన్ కోషీ (రజతం), పూజా ఘట్కర్(కాంస్యం)లు ఈ పతకాలను దక్కించుకున్నారు. అయితే పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం త్రుటిలో తప్పిపోయింది. బంగ్లాదేశ్‌కు చెందిన సకీల్ అహ్మద్ 187.6 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, 187.3 పాయింట్లతో ఓంప్రకాశ్ రజత పతకం సాధించాడు. అయితే రియో ఒలింపిక్స్‌కు ఎంపికయిన ప్రకాశ్ నంజప్ప నాలుగోస్థానంలో రావడం గమనార్హం. పురుషుల 50 మీ. పిస్టల్ టీమ్ ఈవెంట్, మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ రెండింటిలోను భారత్ స్వర్ణ పతకాలు సాధించింది.
టెన్నిస్, టిటిలోనూ..
టెన్నిస్‌లోను భారత్ అధిక్యత స్పష్టంగా కనిపించింది. నాలుగో రోజు అన్ని బంగారు పతకాలు భారత్‌కే లభించాయి, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత క్రీడాకారులు పూర్త్ధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లన్నిటిలోను భారత క్రీడాకారులే ఉండడంతో బంగారు, రజత పతకాలన్నీ కూడా భారత్‌కే దక్కాయి. అలాగే షిల్లాంగ్‌లో జరుగుతున్న టేబుల్ టెన్నిస్‌లో జాతీయ చాంపియన్లు ఆంతోనీ అమల్‌రాజ్, మానిక బాత్రాలు చెరి మూడు బంగారు పతకాలతో హ్యాట్రిక్ సాధించారు. దీంతో భారత్ ఈ విభాగంలో ఏడు బంగారు పతకాలు, అయిదు రజత పతకాలు సాధించినట్లయింది.్భరత పురుషుల, మహిళల స్క్వాష్ టీమ్ ఈవెంట్లలో పాకిస్తాన్‌ను ఓడించి స్వర్ణ పతకాలు సాధించారు.
పురుషుల ఫుట్‌బాల్‌లో సెమీస్‌కు
కాగా, పురుషుల ఫుట్‌బాల్‌లో భారత్ అత్యంత కీలకమైన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో మాల్దీవ్స్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

చిత్రం... స్క్వాష్‌లో పసిడి పతకాలు కైవసం చేసుకున్న భారత జట్లు

4తి100 మీటర్ల మెడ్లీలో స్వర్ణ పతకం గెలిచిన భారత స్విమ్మర్లు

10 మీటర్ల ఎయర్ రైఫిల్ ఈవెంట్‌లో పతకాలన్నీ కైవసం చేసుకున్న భారత షూటర్లు

110 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా చాటిన భారత అథ్లెట్లు