క్రీడాభూమి

భారత్ బలమే మా బలం బిసిబి చీఫ్ నజ్ముల్ హసన్ పపోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్ బలమే తమ బలమనీ, ఒక రకంగా భారత్‌తో కలిసి తాము ముందుకు నడుస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పపోన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంత బలంగా ఉంటే తాము అంతగా బలోపేతమవుతామని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పడు. ఈనెలలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వర్కింగ్ కమిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్‌తో కలిసి చర్చించిన అనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ రెండు క్రికెట్ బోర్డులు ఒకే గళం వినిపిస్తాయని అన్నాడు. ‘బిగ్ త్రీ’ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఐసిసిలో ఎక్కువ వాటా ఇవ్వడాన్ని నిరాకరిస్తూ, ఈ విషయంలో భారీ సంస్కరణకు ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ తెరలేపిన విషయం తెలిసిందే. ఆతర్వాత బిసిసిఐ బలాన్ని గుర్తించి, తన పదవికి రాజీనామా చేసినప్పటికీ, వర్కింగ్ కమిటీ సమావేశం పూర్తయ్యే వరకూ పదవిలో కొనసాగాల్సిందిగా తీర్మానాన్ని ఆమోదించడంతో, ప్రస్తుతానికి మనోహర్ తన సేవలను కొనసాగిస్తున్నాడు. కాగా, అతను చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బిసిసిఐ మద్దతు కూడగట్టుకుంటున్నది. అందులో భాగంగానే బిసిబితో చర్చలు జరుపుతున్నది. ఐసిసి సమావేశంలో భారత్ పక్షాన నిలబడతామని బిసిబి చైర్మన్ పపొన్ తేల్చిచెప్పడం విశేషం.