క్రీడాభూమి

24 ఏళ్ల తర్వాత.. చైనా హెడ్ కోచ్ పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 12: చైనా బాడ్మింటన్ జాతీయ హెడ్ కోచ్‌గా 24 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించిన లీ యాంగ్‌బో పదవీ విరమణను ప్రకటించాడు. అతని మార్గదర్శకంలోనే చైనా పలువురు స్టార్లను బాడ్మింటన్ ప్రపంచానికి అందించింది. రియో ఒలింపిక్స్‌లో చైనా బాడ్మింటన్‌లో కేవలం రెండు స్వర్ణాలతో సరిపుచ్చుకుంది. 2000 తర్వాత చైనా ఇంత దారుణంగా విఫలం కావడం అదే మొదటిసారి. దీనితో యాంగ్‌బోపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి వరకూ అతను అందించిన సేవలను పక్కకుపెట్టి, రియో ఒలింపిక్స్‌లో వైఫల్యాలనే ఎత్తిచూపడం చైనాలో ఫ్యాషన్‌గా మారింది. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన అతను హెడ్ కోచ్‌గా పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించాడు. వైదొలగాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని, వ్యక్తిగత కారణాలతో తానే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు.