క్రీడాభూమి

కాశ్మీర్ మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఇందులో మరో వాదనకు తావులేదని భారత క్రికెటర్ గౌతం గంభీర్ తన ట్విటర్ అక్కౌంట్‌లో పోస్టు చేశాడు. పాకిస్తాన్ మద్దతుదారులు కొంత మంది శ్రీనగర్‌లో ఒక సిఆర్‌పిఎఫ్ జవానును చుట్టుముట్టు, రాళ్లతో కొట్టిన సంఘటనపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఆ జవానుకు తగిలిన ఒక్కో దెబ్బకు వంద మంది జిహాదీలను హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ‘వేర్పాటు వాదుల్లారా.. వెంటనే వెళ్లిపొండి. కాశ్మీర్ మాదే’ అని ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిఆర్‌పిఎఫ్ జవానుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ఇలాంటి సంఘటనలు క్షమార్హం కావని పేర్కొన్నాడు. దుందుడుకు చేష్టలకు కూడా ఒక హద్దు ఉంటుందంటూ కాశ్మీర్ వేర్పాటు వాదులను హెచ్చరించాడు.