క్రీడాభూమి

పంజాబ్‌కు నైట్ రైడర్స్ కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 13: బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్, బ్యాటింగ్‌లో కెప్టెన్ గౌతం గంభీర్ రాణించడంతో, గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఎవరూ ఊహిం చని రీతిలో విజయాలను నమోదు చేసిన పంజాబ్ దూకుడుకు నైట్ రైడర్స్ కళ్లెం వేసింది. ఐపిఎల్‌లో గత ఏడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను ఓడించిన గంభీర్ బృందం మరోసారి అదే ఫలితాన్ని రాబట్టింది. 171 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానంచాడు. జట్టులోని ఆటగాళ్లలో ఎవరూ భారీ స్కోర్లు చేయకపోయినా, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఎంతోకొంత ప్రయత్నిస్తే, మెరుగైన స్కోరును సాధించడం కష్టం కాదని మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిరూపించింది. ఈ జట్టులో అత్యధిక స్కోరు 28 పరుగులు. అయితే, ఐదుగురు బ్యాట్స్‌మెన్ కనీసం ఇరవై పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ తొమ్మిది వికెట్లకు 170 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటింగ్ కంటే నైట్ రైడర్స్ బౌలింగ్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికీ, ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి, 33 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. సునీల్ నారైన్, పీయూష్ చావ్లా, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ తలా ఒక్కో వికెట్ కూల్చాడు. బౌలింగ్ వేసిన వారిలో ట్రెంట్ బౌల్ట్ తప్ప మిగతా వారంతా కనీసం ఒక వికెట్ పడగొట్టడం గమనార్హం.
నారైన్‌కు ప్రమోషన్
కేవలం స్పెషలిస్టు స్పిన్నర్‌గానే చాలా మందికి తెలిసిన సునీల్ నారైన్‌కు నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చాడు. తనతోపాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాన్ని కల్పించాడు. గంభీర్ ప్రయత్నం సఫలమైంది. మొదటి వికెట్‌కు 76 పరుగులు జత కలిసిన తర్వాత వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోగా అవుటైన నారైన్ 18 బంతులోవ్ల 37 పరుగులు సాధించాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాబిన్ ఉతప్ప స్కోరును ముందుకు దూకించడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీనితో 8.1 ఓవర్లలోనే నైట్ రైడర్స్ వంద పరుగవుల మైలురాయిని చేరింది. పవర్ ప్లేలో గతంలో ఎ న్నడూ లేని విధంగా ఏకంగా 76 పరుగులు సాధించింది. కాగా, రెండో వికెట్‌కు 4.2 ఓవర్లలో 40 పరుగులు జత కలవగా, అక్షర్ పటేల్ బౌలిం గ్‌లో రాబిన్ ఉతప్ప బౌల్డ్ అయ్యాడు. అతను 16 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు సాధించాడు. రెండు వికెట్లు పడినప్పటికీ, ఓపెనర్ గంభీర్ పరుగుల వేటలో వెనుకంజ వేయలేదు. పంజాబ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న అతను 33 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఐపిఎల్‌లో అతనికి ఇది 33వ హాఫ్ సెంచరీ. ఆతర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగించాడు. దీనితో 16.3 ఓవర్లలో నే నైట్ రైడర్స్ రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించి, ఎనిమి ది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గంభీర్ 49 బంతులు ఎదుర్కొ ని, 11 ఫోర్లతో 72, మనీష్ పాండే 16 బంతుల్లో 25 పరుగులు చేసి నా టౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 (షహీం ఆమ్లా 25, మానన్ వోహ్రా 28, గ్లేన్ మాక్స్‌వెల్ 25, డేవిడ్ మిల్లర్ 28, వృద్ధిమాన్ సాహా 25, ఉమేష్ యాదవ్ 4/30, క్రిస్ వోక్స్ 2/30).
కోల్‌కతా నైట్ రైడర్స్: 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 171 (సునీల్ నారైన్ 37, గౌతం గంభీర్ 72 నాటౌట్, ఉతప్ప 26, మనీష్ పాండే 25 నాటౌట్).

*గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయన ఉమేష్ యాదవ్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్‌లో అతను ఈ విధంగా నాలుగు వికెట్లు సాధించడం ఇది మూడోసారి.

చిత్రం..గౌతం గంభీర్ 72 నాటౌట్